ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - May 14, 2020 , 01:10:49

వైభవంగా సుదర్శన నారసింహ హోమం

వైభవంగా సుదర్శన నారసింహ హోమం

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. భక్తుల క్షేమం కోసం ప్రతిరోజూ కరోనా ప్రాణినాం.. ప్రజానాం.. భక్తానాం.. సర్వవిధ పరిరక్షణార్థం ధన్వంతరి స్వరూపమైన లక్ష్మీనరసింహస్వామికి మూలమంత్రాలతో హోమం జరుపుతున్నామని ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం సేవలను నిర్వహించి స్వయం భూ, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలతో పాటు ఉత్సవ మంటపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార, అష్టోత్తర సేవలు నిర్వహించారు. 11.30 గంటలకు మహా నివేదన నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటల అలంకార జోడు సేవలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఆరగింపు తదుపరి పవళింపు సేవ నిర్వహించి తిరిగి ఆలయాన్ని మూసివేశారు.

VIDEOS

logo