సోమవారం 01 మార్చి 2021
Yadadri - May 14, 2020 , 01:10:48

గ్రీన్‌జోన్‌లేనే జిల్లా

గ్రీన్‌జోన్‌లేనే జిల్లా

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌

ఆత్మకూరు(ఎం) : వలస కూలీలకు మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చింది తప్పా జిల్లాలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని,  జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన ఏడుగురు వలస కూలీలు ఇటీవల ముంబై నుంచి రావడంతో వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో బుధవారం వారు గ్రామాన్ని సందర్శించి కరోనా వైరస్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన వలస కూలీలకు మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చిందని వారి కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి పాజిటివ్‌ రాలేదని అయినప్పటికీ వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామ ప్రజలందరూ 3 వారాల పాటు స్వీయ నియంత్రణ పాటించి ఇతర గ్రామాలకు వెళ్లకూడదన్నారు. ప్రత్యేక అవసరాల కోసం బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టును పరిశీలించి ఇతర గ్రామాల నుంచి ఎవ్వరినీ పల్లెర్ల గ్రామానికి అనుమతించొద్దని పోలీసులకు సూచించారు. వారి వెంట డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, భువనగిరి ఏసీపీ కృష్ణయ్య, రామన్నపేట సీఐ ఏవీ రంగ, ఎస్సై ఎండీ ఇద్రిస్‌ అలీ, తహసీల్దార్‌ జ్యోతి, మండల వైద్యాధికారి ప్రణీష, సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

వివరాల సేకరణ..

మండలంలోని కొరటికల్‌, పోతిరెడ్డిపల్లి, రేగులకుంట, ఇప్పళ్ల గ్రామాల్లో మండల వైద్యాధికారి ప్రణీష, తహసీల్దార్‌ జ్యోతి, ఎస్సై ఇంద్రిస్‌ అలీ పర్యటించారు. దీంతో ఆయా గ్రామాల్లోని మొత్తం 12 మంది ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి రావడంతో వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు హోం క్వారంటెన్‌ ముద్రలు వేసి 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచించినట్లు వారు తెలిపారు.

VIDEOS

logo