శుక్రవారం 23 అక్టోబర్ 2020
Yadadri - May 13, 2020 , 00:31:08

కరోనా నివారణకు స్వీయనియంత్రణే మార్గం

కరోనా నివారణకు స్వీయనియంత్రణే మార్గం

  తుర్కపల్లి : కరోనా వైరస్‌ను నివారించేందుకు స్వీయనియంత్రణే ఏకైక మార్గమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మం డల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ముస్లిం కుటుంబాలకు హీల్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి శానిటైజర్లు అందజేశారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ బీకునాయక్‌, హీల్‌ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్‌ అక్షయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ బూక్యా సుశీల, పీఏసీఎస్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కొమిరిశట్టి నర్సింహులు పాల్గొన్నారు.

 - ఆత్మకూరు(ఎం)లో ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు ఎద్దు వెంకన్న సౌజన్యంతో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త జగన్‌ సహకారంతో 80 మంది ముదిరాజ్‌ పేద కుటుంబాలు, 22 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేసిన నిత్యావసర సరుకులు, కూరగాయలను సర్పంచ్‌ నగేశ్‌, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచు నవ్య, మాజీ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు

 - ఆలేరులో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ దంపతుల పెండ్లిరోజు సందర్భంగా ఆర్యవైశ్య  జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వృద్ధులు, వలస కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు.    

-యాదగిరిగుట్ట మండలం  కాచారంలో ఐవీఎఫ్‌ ఆధ్యాత్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి అంజయ్యస్వామి పలువురు పేదలకు కూరగాయలు అందజేశారు.

- భువనగిరి మండలం కూనూరులో రేషన్‌కార్డు లేని 60 నిరుపేద కుటుంబాలకు ఎంపీటీసీ పాశం శివానంద్‌ సహకారంతో 15 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. 

-చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ చౌటుప్పల్‌ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను సీఐ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.

 -మోత్కూరు మండలకేంద్రంలో విద్యుత్‌ సబ్‌ డివిజన్‌లో పని చేస్తున్న కార్మికులకు విద్యుత్‌ ఉద్యోగుల సంఘం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం ఆర్గనైజింగ్‌ జిల్లా కార్యదర్శి బిజ్జాల సోమరాజు ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరింగ్‌ కార్మికులు, విద్యుత్‌ బిల్‌ కలెక్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

-రామన్నపేట మండలంలోని సిరిపురంలో కూనూరు ముత్తయ్య సమకూర్చిన బియ్యం, నిత్యావసర సరుకులను గ్రామపంచాయతీ కార్మికులకు సర్పంచు అప్పం లక్ష్మీనర్సు, ఎంపీటీసీ బడుగు రమేశ్‌ పంపిణీ చేశారు. కొమ్మాయిగూడెంలో స్థానిక ఎంపీటీసీ వనం హర్షిణి తన సొంత నిధులతో 300 మంది ఉపాధిహామీ కూలీలకు చేనేత వస్ర్తాలతో తయారు చేసిన మాస్కులు, శానిటైజర్లను సర్పంచ్‌ జెల్లెల లక్ష్మమ్మతో కలిసి పంపిణీ చేశారు. దోమలపల్లి మల్లేశం సహకారంతో సిరిపురం ఎంపీటీసీ బడుగు రమేశ్‌, కూనూరు ముత్తయ్య పోలీసులకు శానిటైజర్లు, పండ్లు అందజేశారు.


logo