గురువారం 26 నవంబర్ 2020
Yadadri - May 13, 2020 , 00:26:11

రక్త దానం.. మహాదానం

రక్త దానం.. మహాదానం

వలిగొండ: రక్తదానం మహాదానమని జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మండలం పరిధి వెల్వర్తిలో స్థానిక యూత్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్‌ పసల అన్నామేరి శౌరి, యూత్‌ అధ్యక్షుడు కూచిమల్ల సుధాకర్‌ ప్రారంభించారు. అనంతరం నర్సుల దినోత్సవం సందర్భంగా అరూరు ఏఎన్‌ఎం శోభరాణిని రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ తక్కళ్ల శ్రావణి, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు