శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - May 12, 2020 , 00:54:18

ప్లాట్ల డబుల్‌ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌

ప్లాట్ల డబుల్‌ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌

చౌటుప్పల్‌ రూరల్: నకిలీ ఆధార్‌, పాన్‌కార్డులు సృష్టించి ఇతరుల ప్లాట్లను విక్రయించి, అమాయకులను మోసం చేసిన వ్యక్తిపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌  పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశారని సోమవారం స్థానిక సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. మండలంలోని తూఫ్రాన్‌పేట గ్రామానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఏనుగు మాధవరెడ్డి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి  కొన్ని సంవత్సరాలుగా ప్లాట్ల అక్రమ దందాకు పాల్పడుతున్నాడు. గ్రామ రెవెన్యూపరిధిలోని గ్రీన్‌సిటీ వెంచర్‌ను  20 ఏండ్ల క్రితం సుమారు 500 ఎకరాల్లో లేఅవుట్‌ చేశారు. వెంచర్‌ నిర్వాహకులు వాయిదాల పద్ధతులో ప్లాట్లను విక్రయించారు. దీంతో సీసీకాపీల ద్వారా వాటి వివరాలు   తెలుసుకొని గ్రీన్‌సిటీ వెంచర్‌ ఉద్యోగులను పరిచయం చేసుకున్నాడు. తర్వాత డబ్బులు ఆశచూపి వారి వద్ద ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి అసలు యజమానులకు బదులు ఇతర వ్యక్తులను సృష్టించి మూడు ప్లాట్లను డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశాడు. మరో శ్రీసాయి ఎస్టేట్‌ వెంచర్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ కానూరి అన్నపూర్ణమ్మ  ఇంతకు ముందే విక్రయించిన రెండు ప్లాట్లను తిరిగి ఆమెతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఇతడు తిరిగి మరో ఇద్దరికి విక్రయించాడు. అంతేకాకుండా సర్వేనెంబర్‌ 125లో ప్లాటు నెంబర్‌ 88ని అసలు యజమానికి బదులుగా వేరే వ్యక్తిని చూపెట్టి అక్రమ దందాకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై ఆరు కేసులు  నమోదు చేశారు. ఓ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 28న మాధవరెడ్డి రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఈక్రమంలో అతడిపై ఉన్న కేసులు బయటకు వచ్చాయి. ఈక్రమంలో  ఆరు కేసుల్లో నిందితుడు కావడంతో పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. 

VIDEOS

logo