శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - May 10, 2020 , 01:12:02

చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి

చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి

అడ్డగూడూరు : చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు.మండలంలోని చిర్రగూడూరులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వాహనాలను తనిఖీ చేసి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా ఎవరైనా వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాస్కు లేకుండా బయట తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కు ధరించాలన్నారు. ఆయన వెంట ఏసీపీ కిష్టయ్య, సీఐ రంగా,ఎస్సై మహేశ్వర్‌, మోత్కూరు ఎస్సై హరిప్రసాద్‌ ఉన్నారు.

- మోత్కూరు, ఆత్మకూరు(ఎం)లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను  డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. అనంతరం మోత్కూరు పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో  పోలీసులు, ఆయా ్ర గామాల ప్రజాప్రతినిధులకు లాక్‌డౌన్‌పై అవగాహన కల్పించారు. ఆత్మకూరులో మాట్లాడుతూ వ్యాపారస్తులు తమ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచిఉంచాలన్నారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరూ మాత్రమే వెళ్లాలని అంతకు మించి ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  


VIDEOS

logo