గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - May 10, 2020 , 01:12:03

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

దేవరకొండ: కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ రుణమాఫీ, రైతుబంధు నిధులు విడుదల చేసి రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ నిలిచారని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద శనివారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్‌, వంగాల ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేశ్‌గౌడ్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ శిరందాసు కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు హన్మంతు వెంకటేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రహత్‌ అలీ, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు

  రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం ఒకేసారి రూ.1210 కోట్లను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం అనుముల మండలంలోని ఇబ్రహింపేట ఐకేపీ సెంటర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం నిర్వహించారు. అనంతరం జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, హాలియా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యడవెల్లి నీలిమా మహేందర్‌రెడ్డి హమాలీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మశంకరయ్య, కౌన్సిలర్‌ నల్లబోతు వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, అంజద్‌ఖాన్‌, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. 

  మండలంలోని కస్తాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి టీఆర్‌ఎస్‌ నాయకులు ధాన్యాభిషేకం, పాలాభిషేకం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కౌన్సిలర్‌ కోడి వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.

  మండల కేంద్రంలోని అంగడిబజార్‌లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహరావు, నాయకులు వెంకటయ్య, నరేందర్‌రావు, వెంకట్‌రెడ్డి, శేఖర్‌, వంశీ, చెన్నయ్య, పాండు, యాదయ్య, దేవయ్య, మురళి, గణేశ్‌, సత్తయ్య, చక్రధర్‌, వెంకట్‌రెడ్డి, రాములు, కిరణ్‌, శ్రీధర్‌రెడ్డి, కిరణ్‌ పాల్గొన్నారు.

  మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ కర్నాటి స్వామి,  రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, జాజుల అంజయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, రఫీక్‌, కుమారస్వామి పాల్గొన్నారు. 

  పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహనుమంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మేగ్యానాయక్‌, చిట్టిబాబునాయక్‌, నాగార్జునాచారి, లక్ష్మీనారాయణ తదితరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

  మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ డీ నారాయణరెడ్డి, ఎంపీపీ రమావత్‌ నందిని, టీఆర్‌ఎస్‌ నాయకులు స్కైలాబ్‌ నాయక్‌, ఎండీ యూసూఫ్‌, డీ వెంకటేశ్వర్లు, బాల సత్యనారాయణ, ఆంగోతు హాతీరాంనాయక్‌, రవితేజ, రవీందర్‌నాయక్‌, వీరసైదులు పాలాభిషేకం చేశారు.

  స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనావత్‌ బాలాజీనాయక్‌, జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్తా మర్రెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ,  సర్పంచులు పాలాభిషేకం చేశారు. 

  మండలకేంద్రంలో జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ మొహసీన్‌ అలీ,  సర్పంచులు మారుతి వెంకట్‌రెడ్డి, గోవిందరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మౌలాలి, ఎంపీటీసీ కళింగరెడ్డి, బాబయ్య, సిద్ధార్థరెడ్డి, రాజు, నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌, ఏడుకొండల్‌ పాలాభిషేకం చేశారు.

  మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్‌ పాలాభిషేకం చేశారు. ఉపసర్పంచ్‌ అమిరెడ్డి పద్మ, మజ్జిగపు సుధాకర్‌రెడ్డి, పందిరి ప్రతాప్‌, మాలి శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎండీ ఆరిఫ్‌, అబ్దుల్లా, సన్నీ పాల్గొన్నారు.

VIDEOS

logo