బుధవారం 03 మార్చి 2021
Yadadri - May 09, 2020 , 00:52:58

మొక్కలను సంరక్షించుకోవాలి

మొక్కలను సంరక్షించుకోవాలి

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

బీబీనగర్‌ : హరితహారంలో భాగంగా నాటిన  మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నాటిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించి ట్యాంకర్‌తో నీరుపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో హరిత తెలంగాణే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు  నాటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో శ్రవణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo