18 మందికి హోం క్వారంటైన్

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం, తాళ్లసింగారం గ్రామాలకు ముంబై నుంచి ఐదుగురు రావడంతో వైద్యసిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ చేశారు. ముంబై నుంచి సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన ముగ్గురు గురువారం గ్రామానికి రావడంతో వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కడి నుంచి వస్తున్న వారిపై మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు పక్కా దృష్టిసారించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ముంబై నుంచి మండలంలోని లింగోజీగూడెంకు ఒకరు, తాళ్లసింగారం గ్రామానికి నలుగురు రావడంతో చైర్మన్ పోలీస్, వైద్యసిబ్బందితో కలిసి ఆయా గ్రామాలను సందర్శించి వారిని హోం క్వారంటైన్ చేశారు. ఎవరైనా ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు గ్రామస్తులను కోరారు.
అడ్డగూడూరులో 13మంది..
అడ్డగూడూరు : ఇతర ప్రాంతాల నుంచి మండలంలోని ఆయా గ్రామాలకు వచ్చిన 13 మందికి హోంక్వారంటైన్ ముద్రలు వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు. మండలంలోని కోటమర్తి గ్రామానికి ముంబై నుంచి ఐదుగురు, హైదరాబాద్ నుంచి ఐదుగురు, లక్ష్మీదేవికాల్వ గ్రామానికి ఇద్దరు, సూర్యాపేట నుంచి మండలకేంద్రానికి ఒకరు మొత్తం 13 మంది రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి హోంక్వారంటైన్ ముంద్రలు వేసి 28 రోజుల పాటు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. వారికి ఎలాంటి కరోనా లక్షణా లు లేనట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు.
తాజావార్తలు
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్‌కు 'చెక్'..నిరాశలో నితిన్
- అంబానీ, అదానీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మోదీ : రాహుల్ గాంధీ
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని పనికిరానివాడా.. కాదా అన్నది ప్రశ్న కాదు: రాహుల్‌గాంధీ
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్