యాదాద్రిలో వైభవంగా శ్రీ నృసింహ జయంతి

యాదాద్రిభువనగిరిజిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం సహస్ర ఘటాభిషేకం, సహస్రనామార్చనలతో పాటు మహాపుర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిత్య హవనం, మూలమంత్ర జపాలు, పారాయణాలు నిర్వహించింది. శ్రీవారి బాలాలయంలో సాయంత్రం మహామంటపంలో శ్రీ నృసింహ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహుని అలంకారంలో దర్శనం..
ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు శ్రీలక్ష్మీనరసింహుని అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవ మండపంలో శ్రీవారిని అధిష్ఠించి వేడుకలు జరిపారు. మరోవైపు నృసింహోద్భవ సమయంలో జై నారసింహ... జై జై నారసింహ అంటూ అర్చకబృందం శ్రీవారిని కొలువగా ఆలయం తన్మయత్వంతో నిండిపోయింది. అనంతరం స్తంభోద్భవుడై దుష్ట శిక్షణ, శిష్టజన సంరక్షణ, ధర్మ పరిరక్షణ చేసేందుకు ఆవిర్భవించిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు ప్రధానార్చకులు వివరించారు.
పాతగుట్టలో ముగిసిన ఉత్సవాలు..
మూడు రోజులుగా పాతగుట్టలో కూడా జరుగుతున్న జయంతి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. అంతకుముందు నిత్యహవనములు, మూలమంత్ర జపములు, లక్ష్మీసూక్త, శ్రీవిష్ణు సహస్రపారాయణములు, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. పాతగుట్ట ఆలయ ఇన్చార్జి జూశెట్టి కృష్ణగౌడ్, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు, కొడకండ్ల మాధవాచార్యులు ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు జరిగాయి.
శ్రీవారికి 23 తులాల బంగారు హారం బహూకరణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి హైద్రాబాద్ కొత్తపేటకు చెందిన ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ అధినేత గున్నా సంజీవరెడ్డి 23 తులాల బంగారు హారాన్ని బహూకరించారు. అయితే జయంత్యుత్సవాల్లో భాగంగా ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు బుధవారం స్వామివారికి ఆ హారాన్ని అలంకరించారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్