దాతల సాకారం అభినందనీయం

పేదలకు అండగా నిలుస్తున్న దాతలు
నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ
అనాథలకు అన్నదానం
తుర్కపల్లి : లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు మేమున్నామంటూ దాతలు ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని చాటుకోవడం అభినందనీయమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బొమ్మలరామారం మండలం మైలారం, మైలారంతండాలో దాత రామిడి జంగారెడ్డి, మాచన్పల్లిలో టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి కృష్ణ, మల్యాలలో పలువురు దాతలు సమకూర్చిన నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు, మాస్కులను ఆయా గ్రామాల ప్రజలు, పారిశుధ్య కార్మికులకు గొంగిడి మహేందర్‌రెడ్డి అందజేశారు. అనంతరం ఆయా గ్రామాల పారిశుధ్య కార్మికులను సన్మానించి ఒక్కో కార్మికుడికి రూ.500ల నగదును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాక్డౌన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవడం సంతోషకరమన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు ఇండ్లల్లోనే ఉంటూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏనుగు కొండల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
- యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, జంగంపల్లి గ్రామాల్లో శ్రీ లోగిల్లు డెవలపర్స్, యాత్ర స్వచ్ఛంద సంస్థ, ఎగ్గిడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది ఉపాధిహామీ కూలీలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ కర్రె వెంకటయ్య, శ్రీ లోగిళ్లు డెవలపర్స్ చైర్మన్ వంటేరు సురేశ్‌రెడ్డి మాస్కులు అందజేశారు.
- ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగ సత్యనారాయణగుప్తా ఆధ్వర్యంలో 25 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి విశ్వనాథం, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ వంగపల్లి అంజయ్యస్వామి, మీడియా కమిటీ చైర్మన్ రాగి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
- రాజాపేట మండలంలోని బేగంపేటలో 550 పేద కుటుంబాలకు గ్రామానికి చెందిన దాతలు ఆర్యవైశ్య నాయకులు పులిగిల్ల శివనాగేందర్, రెబెల్లి శ్రీనివాస్, రెబెల్లి కమలాకర్ అందించిన బియ్యం, నిత్యావసర సరుకులను డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి పంపిణీ చేశారు.
- ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామీణ వైద్యుల సంఘం మండల కమిటీ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులకు అన్నదానం చేశారు.
- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉప్పల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఉప్పల శ్రీను యువ సైన్యం రాష్ట్ర నాయకుడు సరాబు సంతోశ్ ఆలేరు పట్టణం కొలనుపాక సమీపంలోని అనాథ మహిళావృద్ధాశ్రమంలోని వృద్ధులు, ఆలేరు మున్సిపల్ సిబ్బందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్ పాల్గొన్నారు.
- మోటకొండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాడ గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ బేతి వెంకటేశ్వర్లు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లను జర్నలిస్టులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బందికి ఎంపీడీవో వీరస్వామి, తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత అందజేశారు. ఇక్కుర్తిలో బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య సహకారంతో గ్రామంలోని పేద కుటుంబాలకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్లంల సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ గంగపురం మల్లేశ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
భువనగిరి నియోజకవర్గంలో..
భువనగిరి, నమస్తే తెలంగాణ : పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో 650 మంది వలస కార్మికులకు 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతీమహేశ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
- గంజ్ మార్కెట్ సమీపంలో జిల్లా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్, చిరాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఆహార ప్యాకెట్లను మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య నిరుపేదలకు అందజేశారు. 15వ వార్డులో గడ్డం సోమ్చంద్, వార్డు కౌన్సిలర్ నజియారహమాన్ జహంగీర్ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య వార్డు ప్రజలకు పంపిణీ చేశారు.
- అర్బన్‌కాలనీ, హనుమాన్వాడ, ఆర్బీనగర్లోని పేద ఆర్యవైశ్యులకు వాసవీ క్లబ్ సభ్యులు బుస్స వెంకటేశ్, రమేశ్ సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసరాలను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ అందజేశారు.
- వలిగొండ మండలం పులిగిల్లలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా దాత పల్లెర్ల రాజు సౌజన్యంతో సమకూర్చిన సరుకులను గ్రామ పంచాయతీ కార్మికులతోపాటు 100 నిరుపేద కుటుంబాలకు సర్పంచ్ తుమ్మల వెంకట్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు డేగల పాండరి పంపిణీ చేశారు. వలిగొండ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర తన నివాస గృహంలో పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ పల్సం రమేశ్, పైళ్ల భీమార్జున్రెడ్డితో కలిసి ఆశ కార్యకర్తలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. వలిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక పోలీసులకు ఎంపీటీసీ పల్సం రమేశ్ అన్నదానం నిర్వహించారు.
- బీబీనగర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశ వర్కర్లు, జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. గూడూరు పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు, వాహనడ్రైవర్లకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
- భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని మెహర్‌నగర్‌లో వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కూరగాయలను పంపిణీ చేశారు. ఇంద్రియాల గ్రామంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వాయపారి పాళెం శివకృష్ణ ఆధ్వర్యంలో కూరగాయలను అందజేశారు. అలాగే రామలింగంపల్లి లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు మైల శ్రీశైలం ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు.
చౌటుప్పల్ పరిధిలో...
చౌటుప్పల్, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షుడు గౌర సతీశ్ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
- అడ్డగూడూరు మండలంలో మాజీ మంత్రి ఉప్పునూతుల పురుషోత్తంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన సోదరుడు సోమ నర్సింహారెడ్డి సహకారంతో మండలకేంద్రంలో పేదలు, జర్నలిస్టులకు, గ్రామపంచాయతీ సిబ్బందికి మొత్తం 130 మందికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు.
- మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అన్నెపు వాడ, గాంధీనగర్, ధర్మాపురం, రజక బజారులో దాతల సాయంతో మున్సిపల్ కౌన్సిలర్లు జి.కవితా లక్ష్మీనర్సింహారెడ్డి, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
- రామన్నపేట మండలకేంద్రంలో టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, గంగుల రాజిరెడ్డి, పూసబాలకిషన్లు సమకూర్చిన బియ్యం, నిత్యావసర సరుకులను 40 నిరుపేద ముస్లింకుటుంబాలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. స్థానిక ఎంపీటీసీ వనం హర్షిణి 35 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నల్లబోలు విజయ్‌భాస్కర్‌రెడ్డి రామన్నపేట పోలీస్ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు