సోమవారం 08 మార్చి 2021
Yadadri - May 04, 2020 , 01:12:24

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

  • రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ:  రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి పక్ష పార్టీల ఆరోపణలను పట్టించుకోమని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఆదివారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్నకందుకూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన  పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆరోపణలు చేయాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌ మాటల్లో నిజం లేదన్నారు. ఎప్పటికప్పుడు గన్నీ బస్తాలను దిగుమతి చేసుకొని కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానకాలం కోసం ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయంతో పంట దిగుబడులు పెరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 2018-19  సంవత్సరంలో 2.8 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి రాగా  ఈ సారి  3,94,318 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. అనంతరం నెల రోజుల క్రితం వడగండ్ల వానతో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 24వేల ఎకరాల్లో వరిపంటకు  తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవాలని వారు రైతుబంధు సమితి చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేయగా స్వీకరించిన పల్లా సమస్యలను  సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని హా మీ ఇచ్చారు.  కార్యక్రమంలో డీసీవో వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఏవో రాజేశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల   అధ్యక్షుడు కర్రె వెంకట య్య, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య, ఎంపీటీసీ రేపాక మౌనిక, ఉప సర్పంచ్‌ రేపాక స్వామి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ కళ్లెపల్లి శ్రీశైలం పాల్గొన్నారు.  

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఘనంగా సన్మానం..

ఆలేరు టౌన్‌ :  రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌గా తొలిసారి ఆలేరు మండలానికి వచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. ఆలేరు మండలంలోని మంతపురి, శారాజిపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆలేరు పట్టణంలోని ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య కార్యాలయంలో  ఆయనకు  టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు  శాలువాలు కప్పి పూలమాల వేసి సన్మానం చేశారు.  కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ చింతకింది చంద్రకళ, ఆలేరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మొరిగాడి మాధవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం..

ఆలేరు రూరల్‌ :  రైతులకు అండగా ప్రభుత్వం ఉం టుందని రైతు బంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మంతపురిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్ర భుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.  ఈసందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిక్షణం మానిటరింగ్‌ చేస్తూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగూల శ్రీనివాస్‌, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పురి శంకరయ్య, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్‌, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ,  సర్పంచ్‌ చెక్కిల్ల మాధవి, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని వినతి..

భువనగిరి, నమస్తే తెలంగాణ : ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం మహిళా విభాగం నాయకురాలు భాగ్యలక్ష్మి కోరారు. ఈ మేరకు ఆదివారం రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు.

VIDEOS

logo