శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - May 01, 2020 , 01:02:17

పండ్ల తోటల పరిశీలన

పండ్ల తోటల పరిశీలన

రామన్నపేట : ఈదురుగాలికి దెబ్బతిన్న మామిడి, నిమ్మ, బత్తాయి తోటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి సౌమ్య పరిశీలించారు. మండలంలోని కక్కిరేణిలో ఆమె గురువారం పర్యటించి రెండురోజుల క్రితం జరిగిన నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కూలిన చెట్లు, నేలరాలిన కాయలను ఆమె పరిశీలించారు. పంట నష్టంపై నివేదిక తయారు చేయించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో గుండు రమేశ్‌, చిల్లా సురేశ్‌, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo