10 మందికి హోంక్వారంటైన్

అడ్డగూడూరు : గట్టుసింగారంలో 10 మందిని హోం క్వారంటైన్ చేసినట్లు అడ్డగూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని 11 గ్రామాల్లో మొత్తం 511 మంది హోంక్వారంటైన్లో ఉన్నారని వీరిలో 90 మందికి గడువు ముగిసిందన్నారు. 10 మంది చెన్నై నుంచి గట్టుసింగారానికి రాగా 14 రోజుల పాటు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని సూచించామన్నారు.
మాదాపూర్‌లో..
తుర్కపల్లి : హోంక్వారంటైన్లో ఉండాలని తుర్కపల్లి మండలం మా దాపూర్కు చెందిన 22 మందికి సూ చించినట్టు తుర్కపల్లి తహసీల్దార్ సలీమొద్దీన్ ఆదివారం తెలిపారు. కీసర మండలం చీర్యాల్‌లో శుక్రవారం కరో నా పాజిటివ్ వ్యక్తిని గుర్తించారు. కాగా మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం చీ ర్యాల్లో జరిగిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైనట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఆదివారం గ్రామాన్ని సందర్శించి అం త్యక్రియలకు హాజరైన ఇద్దరు వ్యక్తుల తో పాటు వారి ఇంట్లో ఉన్న ఓ అమ్మా యి, గ్రామంలో వీరు కలిసిన మరో 19 మందిని గుర్తించి మొత్తం 22 మం ది హోంక్వారంటైన్లో ఉండాలని స్టాంపింగ్ వేశారు.
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏళ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!