మంగళవారం 20 అక్టోబర్ 2020
Yadadri - Apr 12, 2020 , 23:52:05

సేవకు నమస్తే..

సేవకు నమస్తే..

భువనగిరి, నమస్తే తెలంగాణ : భువనగిరి పట్టణంతోసహా అన్ని మండలాల్లో వలస కార్మికులు, గ్రామస్తులకు ఉచితంగా బియ్యం, ఆహార ప్యాకెట్లను దాతల సహకారంతో మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఆదివారం అందజేశారు. భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్‌ హోటల్‌ వద్ద శ్రీసాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం ట్రస్టు ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, కమిషనర్‌ వంశీకృష్ణ, 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతి పంపిణీ చేశారు. భువనగిరి మండలంలోని వడపర్తి, మన్నెవారిపంపు గ్రామాల్లో వడపర్తి గ్రామ సర్పంచ్‌ కృష్ణారెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. బస్వాపురంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి సౌజన్యంతో 700 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో...

మండలంలోని కంచనపల్లి గ్రామ సర్పంచ్‌ దామోదర్‌, నర్సయ్యగూడెం గ్రామస్తులకు రైతు పల్లపు ఐలయ్య కూరగాయలు పంపిణీ చేశారు.  మండలంలోని వేములకొండ గ్రామ వార్డు సభ్యులు మహమ్మద్‌ దస్తగిరి, దాసరి సుజన శ్రీరాములు అందజేసిన మాస్కులను 600 మంది గ్రామస్తులకు ఎంపీటీసీ సామ రాంరెడ్డి పంపిణీ చేశారు. 

బీబీనగర్‌లో...

మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ బొక్క జైపాల్‌రెడ్డి పోలీసు సిబ్బందికి అన్నదానం చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన ఆహార పొట్లాలను జడ్పీటీసీ ప్రణీత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పింగళ్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మి రవాణా సరుకులు తీసుకెళ్తున్న వాహనదారులకు, నిరుపేదలకు అందజేశారు. బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ పూర్ణచందర్‌ మండల కేంద్రంలోని లెప్రసీ కాలనీ వాసులకు, పాలమూరు వలస కార్మికులకు కూరగాయలు అందజేశారు. రాయరావుపేటలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఇంటింటికీ ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, సర్పంచ్‌ బొర్ర రమేశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లిలో...

పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని భద్రావతీ కాలనీలో చేనేత నాయకులు కర్నాటి దాశరథి ఆధ్వర్యంలో 15 మంది చేనేత కార్మికులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. వానర నేస్తం మోహన్‌రెడ్డి 20 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు బొక్క సత్తిరెడ్డి, రామిడి పాండు రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. 

భువనగిరి పట్టణంలో...

పట్టణంలోని 33వ వార్డులో హిందూ యూత్‌ సహకారంతో అందజేసిన నిత్యావసర సరుకులను మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వార్డు కౌన్సిలర్‌ అవంచక క్రాంతి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్‌ కాలనీ ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు నాకోటి నగేశ్‌, బల్ల వేణు, దోమకొండ అనిల్‌, సంజయ్‌,  శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కరోనా కట్టడి అందరి భాధ్యత

రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

బీబీనగర్‌: కరోనా కట్టడి ప్రజలందరి భాధ్యత అని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించి, మాస్కు లు ధరించి వైరస్‌ నివారణలో భాగస్వామ్యం కావాలని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్‌ జడ్పీటీసీ ప్రణీత ఆధ్వర్యంలో ఆదివారం మండల కేం ద్రంలో వారు గ్రామస్తులకు కోడిగుడ్లు అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల ప్రజలకు ప్రణీత రూ.6 లక్షల సొంత ఖర్చులతో 4 లక్షల గుడ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను ప్రపంచమంతా హర్షిస్తున్నదన్నారు. యాదాద్రి భువనగిరి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ కృషి వల్లే కరోనా జిల్లాలోకి ప్రవేశించలేదన్నారు. కరోనాను అరికట్టేందుకు ఆహోరాత్రులు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లావణ్య, ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా, మండల కోఆర్డినేటర్లు అమరేందర్‌, జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ పాల్గొన్నారు.


logo