సోమవారం 01 మార్చి 2021
Yadadri - Apr 12, 2020 , 00:16:34

విరాళాల వెల్లువ

విరాళాల వెల్లువ

  • తన సొంత నిధుల నుంచి డీఈవో చైతన్య జైని రూ.50వేలు
  • జైని ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ నుంచి రూ.50వేలు
  • డీఈవో భర్త రామకృష్ణ రూ.1,00,000 
  • వాసవీ టీచర్స్‌ రూ.59,200

భువనగిరి, నమస్తే తెలంగాణ: కరోనా తీసుకొచ్చిన ఆపత్కాలంలో ప్రజలకు కనీస అవసరాలు తీర్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని రూ.50,000 చెక్కును కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు శనివారం విరాళంగా అందజేశారు. జైని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ విజయలక్ష్మీ జైని, ప్రభాకర్‌ జైని రూ.50,000, డీఈవో చైతన్యజైని భర్త, ఏపీలో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ, తనతోపాటు తన  కుటుంబసభ్యులు ఆంజనేయులు, స్వరాజ్యలక్ష్మి దంపతుల పేరుపై రూ.1,00,000 చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసవి టీచర్స్‌ అసోసియేషన్‌ నుంచి సేకరించిన రూ.59,200 చెక్కును యూనియన్‌ ప్రతినిధులు కలెక్టర్‌కు అందజేశారు. జిల్లాలోని వాసవీ టీచర్స్‌ అసోసియేషన్‌ నుంచి రూ.59,200 విరాళాన్ని కూడా సంస్థ ప్రతినిధులు ఆలేరు ఎంఈవో బచ్చు లక్ష్మీనారాయణ, పారుపల్లి స్కూల్‌ అసిస్టెంట్‌ బుస్తా రమేశ్‌ కలెక్టర్‌కు అందజేశారు. సందర్భంగా డీఈవో చైతన్య జైని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయ లోకం రూ.5,00,00 పైబడి విరాళాలు తమ ద్వారా కలెక్టర్‌కు అందజేశామని చెప్పారు. విరాళాలు అందించిన డీఈవో దంపతులు, వాసవీ టీచర్స్‌ ప్రతినిధులను కలెక్టర్‌ అభినందించారు. 

VIDEOS

logo