ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Apr 12, 2020 , 00:11:16

మానవత్వం పరిమళించె..

మానవత్వం పరిమళించె..

  • పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 
  • మాస్కులు, శానిటైజర్లు, బియ్యం అందజేత
  • దాతలు, స్వచ్ఛంద సంస్థలు, యువకులకు లబ్ధిదారుల జేజేలు

చౌటుప్పల్‌, నమస్తే తెలంగాణ/మోత్కూరు : పేదలకు దాతలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యూత్‌ ప్రతినిధులు అండగా నిలుస్తూ మానవత్వం చాటుతున్నారు. లబ్ధిపొందిన వారు దాతల సహకారానికి జేజేలు పలుకుతున్నారు. మోత్కూరు మున్సిపల్‌ కేంద్రంలోని 10వ వార్డు కౌన్సిలర్‌ బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రా మేఘారెడ్డి పట్టణంలోని సుందరయ్యకాలనీ, అన్నెపు వాడ, కాశవారిగూడెంలలో 500 కుటుంబాలకు బియ్యం, కురగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. మండలంలోని దాచారం గ్రామంలో బేడ బుడిగ జంగాల జిల్లా అధ్యక్షుడు కడమంచి వస్తాద్‌ గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పాలడుగు గ్రామంలో గ్రామ యువకులు డాక్టర్‌ గుండు శుభాష్‌ చంద్రబోస్‌, జనసేన గ్రామ శాఖ అధ్యక్షుడు బొడిగే పవన్‌కల్యాణ్‌, కందిగట్ల గణేశ్‌, జర్నలిస్టు పబ్బు కృష్ణ, 7వ వార్డు సభ్యుడు జక్కుల శ్రీశైలం కలిసి 500 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అంద చేశారు. మండలంలోని పాటిమట్ల గ్రామంలో పారిశ్రామిక వేత్త రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

చౌటుప్పల్‌ పట్టణంలో..

చౌటుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలోని 100 మంది పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్లకు కౌన్సిలర్‌ ఆలె నాగరాజు ఆధ్వర్యంలో శివసేన యూత్‌ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ రాందుర్గారెడ్డి పాల్గొన్నారు.

అడ్డగూడూరులో..

మండలంలోని ధర్మారం గ్రామంలో పేద ప్రజలకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ కూరగాయలు పంపీణీ చేశారు. మండల కేంద్రంలో రేషన్‌ కార్డు లేని పేదప్రజలకు, వలస కూలీలకు 5 కిలోల బియ్యాన్ని, నిత్యావసర సరుకులను సర్పంచ్‌ బాలెంల త్రివేణి పంపిణీ చేశారు. జానకిపురం గ్రామంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పాస్టర్‌ కూరగాయలు పంపీణీ చేశారు.

సంస్థాన్‌నారాయణపురంలో...

మండలంలోని చిమిర్యాల గ్రామానికి దుండగుల రాములమ్మ కుమారులు నగేశ్‌, ప్రభాకర్‌ తమ తల్లి జ్ఞాపకార్థం గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై నాగరాజు, సర్పంచు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్దగోని రమేశ్‌గౌడ్‌ పోలీసులకు, జర్నలిస్టులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది అంజయ్య, కరుణాకర్‌, షఫీ, వెంకట్‌రెడ్డి, లింగస్వామి, నాయకులు మార్కండేయ, గిరి, శ్రవణ్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. సంస్థాన్‌ నారాయణపురం గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు మాస్కులను, చేతి తొడుగులను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దగోని రమేశ్‌, పి.కార్తీక్‌, గంగపురం సాయి, పోలోజు మధు  పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ మండలంలో..

మండలంలోని దండుమల్కాపురం, ఎల్లగిరి గ్రామాల పంచాయతీ సిబ్బందికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఎలువర్తి యాదగిరి, రిక్కల ఇందిర, ఉప సర్పంచు మల్కాజిగిరి కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

రామన్నపేటలో..

రామన్నపేట సర్పంచ్‌ శిరీష పిలుపుతో రిటైర్డ్‌ ఉద్యోగి కోఆప్షన్‌ సభ్యుడు తాటికొండ సూర్యనారాయణ పారిశుధ్య కార్మికులకు మధ్యాహ్న భోజనం, సబ్బులు అందించారు. కొమ్మాయిగూడెంలో సీపీఎం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు 30 కిలోల బియ్యాన్ని సర్పంచ్‌ లక్ష్మమ్మ అందించి, వారిని సన్మానించింది. ఉత్తటూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి మొగలయ్య కూరగాయలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద బైరబోయిన లక్ష్మణ్‌ పోలీసులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు.

బీబీనగర్‌లో...

బీబీనగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లోని పేదలకు, కార్మికులకు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు నిత్యావసర సరుకులు అందజేశారు. రావిపహాడ్‌ గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మనోహర్‌రావు కూరగాయలు పంపిణీ చేశారు. రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి పోలీసు సిబ్బందికి అన్నదానం చేశారు. భట్టుగూడెం పరిసర ప్రాంతాల్లోని వలస కార్మికులకు ఏఎన్‌ఎంలు కైరంకొండ సరస్వతి, వసంత కూరగాయలు, బియ్యాన్ని పంపిణీ చేశారు. బీబీనగర్‌ ఏసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌ కార్మికులకు, పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని పద్మజ టెక్స్‌టైల్స్‌ ఎండీ ప్రసాద్‌ గూడూరులోని టోల్‌ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి 1000 మాస్కులు అందజేశారు. కార్యక్రమాల్లో మాజీ వైస్‌ ఎంపీపీ లింగయ్యగౌడ్‌  పాల్గొన్నారు.  

భువనగిరి పట్టణంలో..

పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో నివసిస్తున్న 400 మంది కార్మికులకు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సత్రం అధ్యక్షుడు కంచర్ల రమణయ్య, సెక్రెటరీ బెలిదే వెంకటేశ్‌, ప్రోగ్రాం చైర్మన్‌ చెన్న మహేశ్‌, 17వ వార్డు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గాదె శ్రీనివాస్‌, సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్‌ పొత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్‌ ఈరపాక నర్సింహ, నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని 8వ వార్డులోని ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఆ వార్డు కౌన్సిలర్‌ స్వామి బాలింతలకు బియ్యం, కందిపప్పు, నూనె, బాలామృతం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీచర్‌ సరోజ, సహాయకురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లిలో...

భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో విధినిర్వహణలో ఉన్న 40 మంది పారిశుధ్య కార్మికులకు పోచంపల్లి పట్టణానికి చెందిన దుద్యాల బాలకృష్ణ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. పట్టణంలోని చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మంగళపల్లి శ్రీహరి తహసీల్దార్‌ దశరథ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని 4వ వార్డులోని ఇందిరానగర్‌ కాలనీలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పాలం శివకృష్ణ ఆధ్వర్యంలో 100 మందికి వారానికి సరిపడా కూరగాయలను ఎస్సై రాజు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ చక్రపాణి ఉన్నారు. 

ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్కులు సురక్షితం : ఏసీపీ సత్తయ్య

మున్సిపల్‌ కేంద్రానికి చెందిన సైంటిస్టు గట్టు శ్రవణ్‌ తయారు చేసిన ప్రొటెక్టివ్‌ మాస్కులు ధరించడం ఎంతో సురక్షితమని ఏసీపీ సత్తయ్య తెలిపారు. చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లోని కానిస్టేబుళ్లు, ట్రాఫిక్‌ పోలీసులు, ప్రభుత్వ దవాఖాన సిబ్బందికి శ్రవణ్‌ తయారు చేసిన 200 ప్రొటెక్టివ్‌ మాస్కులను ఏసీపీ అందజేశారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ సీఐ ముని  పాల్గొన్నారు. 

VIDEOS

logo