సహకారానికి వందనం

- పేదలను ఆదుకుంటున్నదాతలు, స్వచ్ఛంద సంస్థలు
- బియ్యం, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ
న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అండగా ఉంటున్నారు. లబ్ధి పొందిన నిరుపేదలు, వలస కార్మికులు దాతలకు వందనాలు తెలుపుతున్నారు. శుక్రవారం పలువురు దాతలు నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేశారు. యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్న వివిధ రాష్ర్టాలకు చెందిన 537 వలస కూలీలకు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను ఆర్డీవో భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 100 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. మహబూబ్‌పేట, చొల్లేరు గ్రామాల్లో సూదగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను సర్పంచులు ఆరె స్వరూపామల్లేశ్గౌడ్, తోటకూరి బీరయ్య పారిశుధ్య కార్మికులకు అందజేశారు.
-తుర్కపల్లి మండలంలోని వాలసమర్రి, రామోజీనాయక్‌తండా, చొక్లాతండా, బద్దూతండాల్లో సర్పంచులు తోగుల ఆంజనేయులు, శారద, సురేశ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
-మోటకొండూర్ మండలంలోని ఆరెగూడెంలో సూదగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులను పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులకు అందజేశారు. నాంచారిపేట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు గంధమల్ల కరుణాకర్ పిట్టలగూడెంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మోటకొండూర్ ఎస్సై వెంకన్న చాడలో మాస్కులు అందజేశారు. కదిరేణిగూడెంలో సర్పంచ్ వేముల పాండు ఆధ్వర్యంలో మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
-ఆత్మకూరు(ఎం)లో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 30 పద్మశాలీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పోలీసులకు, ఆశకార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, పండ్లు పంపిణీ చేసి సన్మానించారు. సాయిసేవా సమితి అధ్యక్షురాలు బీసు ధనలక్ష్మి ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేయగా, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ పూర్ణచందర్‌రాజు వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
-ఆలేరు మండలంలోపోలీసులకు మదర్డైయిరీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, లింగాల శ్రీకర్‌రెడ్డి, మామిడాల ఆంజనేయులు, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డికి వారు మాస్కులు, శానిటైజర్స్ బాటిళ్లను అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆలేరు ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఆలేరు మున్సిపాలిటీ సిబ్బందికి నార్ముల్ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, లింగాల శ్రీకర్‌రెడ్డి, మామిడాల ఆంజనేయులు బట్టర్ మిల్క్ ప్యాకెట్లు అందజేశారు. స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలకు సంస్థ అధ్యక్షుడు పంతం కృష్ణ నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందజేశారు.
-గుండాల మండలంలో గ్రామ పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, హమాలీ సంఘం సభ్యులకు 2000 మాస్కులు, శానిటైజర్లను కాంగ్రెస్ జిల్లా నాయకుడు అండెం సంజీవరెడ్డి ఉచితంగా అందజేశారు.
-భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్ హోటల్లో శ్రీసాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో వలస కార్మికులకు 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతిమహేశ్ సౌజన్యంతో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని 29,12,13వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ కూరగాయలు పంపిణీ చేశారు. రాయగిరిలో ప్రయాణికులకు రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వక్ఫ్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఆర్డీవో భూపాల్‌రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భువనగిరి మండలం తుక్కాపురంలో 4వ వార్డు సభ్యుడు ఏడుమేకల మహేశ్ ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. కమ్మగూడెంలో అనుగ్రహ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, ఫాదర్లు టి. థామస్, టి. జోసఫ్ సహకారంతో గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మాదాను థామస్ ఆధ్వర్యంలో 25కిలోల ఉచిత బియ్యం బస్తాలను 17మంది నిరుపేదలకు రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ పంపిణీ చేశారు.
బీబీనగర్ మండలంలోని పెద్దపలుగుతండా ప్రజలకు ఎంపీపీ సుధాకర్‌గౌడ్ కూరగాయలు పంపిణీచేశారు. కొండమడుగులో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో కార్మికులకు గుడ్లు, కూరగాయలు అందజేశారు. గూడూరు పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద బీబీనగర్‌కు చెందిన వార్డు సభ్యుడు పంజాల సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నెమురగొములలో 1వ వార్డు సభ్యుడు సంకూరి శ్రీకాంత్ సొంత ఖర్చులతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రాఘవాపురంలో గ్రామానికి చెందిన బుయ్య కిరణ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఐ,ఎస్సైలు నిరుపేదలకు కూరగాయలు అందజేశారు. గూడూరులో సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. బీబీనగర్‌లో రాళ్లబండి వెంకటేశ్‌గౌడ్ సొంత డబ్బులతో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
- మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెంలో రేషన్‌కార్డులు లేని 10 కుటుంబాలకు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. గామంలోని పలు వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రేషన్ కార్డులు లేని 10 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో ఉల్లిగడ్డ, అర కిలో కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్ పంపిణీ చేశారు.ఆరేగూడెం గ్రామంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాకూబ్‌రెడ్డి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
-చౌటుప్పల్‌లో కూరగాయల విక్రేతలకు, బుడగ జంగాలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాస్కులు అందజేశారు.
-సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఇటుకబటీల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు మహిత సంస్థ ఆధ్వర్యంలో మానూస్ యూనిదాస్ సహకారంతో ఎంపీపీ ఉమాదేవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివారాత్రి సాగర్ పోలీసులకు, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. అల్లందేవిచెర్వులో సర్పంచ్ యాదయ్య ద్విచక్రవాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. గుజ్జలో సర్పంచ్ యాదవరెడ్డి పారిశుధ్య కార్మికులతోపాటు రోడ్లను శుభ్రం చేశారు. సర్వేల్లో హైపోక్లోరైట్‌ను పిచికారీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్‌బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు