దళారులను ఆశ్రయించొద్దు..

- దళారులను ఆశ్రయించొద్దు..
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
భువనగిరి, నమస్తే తెలంగాణ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మండలంలోని చందుపట్ల, నాగిరెడ్డిపల్లి, వీరవెల్లి, ఎర్రంబల్లి, నమాత్‌పల్లి, బండసోమారం, గౌస్‌నగర్, రామచంద్రాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. అనంతరం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యుడు సుబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్యదేవేందర్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు డాక్టర్ నోముల పరమేశ్వరెడ్డి, మందడి లక్ష్మీనరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జిట్టా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఎలాంటి ఆటంకాలు రానివ్వం
బీబీనగర్: లాక్డౌన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. బీబీనగర్ మండలంలోని జంపల్లి, పెద్దపలుగు తండా, గొల్లగూడెం, మాదారం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ ప్రణీత, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గణేశ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట : రాష్ట్రప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలకేంద్రంతోపాటు ఇంద్రపాలనగరం,దుబ్బాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.30వేల కోట్లు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, సింగింల్ విండో చైర్మన్ భిక్షంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అంబటి ఉపేంద్రమ్మ, తహసీల్దార్ శ్రీనివాసకుమార్,ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి,సర్పంచ్‌లు గోదాసు శిరీష,కాటేపల్లి సిద్దమ్మ,నీల జయలక్ష్మి,ఎంపీటీసీలు ఎండీ. రేహన్, గొరిగే నర్సింహ, పూస బాలమణి, మడూరి జ్యోతి, సీఈవో జంగారెడ్డి, ఏపీఎం అంజయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం