ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Apr 07, 2020 , 00:18:46

పకడ్బందీగా లాక్‌డౌన్‌..

పకడ్బందీగా లాక్‌డౌన్‌..

  • తుర్కపల్లిలో మర్కజ్‌ అనుమానితుడి గుర్తింపు
  • అన్ని గ్రామాల్లో హైడ్రోహైపోక్లోరైట్‌ ద్రావణాల పిచికారీ
  • వలిగొండలో లాడౌక్‌న్‌పరిశీలించిన డీసీపీ నారాయణరెడ్డి

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : చౌటుప్పల్‌ పరిధిలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగింది. సోమవారం అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి.  కిరాణా, మెడికల్‌ షాపులు, వాటర్‌ ప్లాంట్లు మాత్రమే తెరిచి ఉంచారు. నిత్యావసర సరుకుల షాపుల ఎదుట ప్రజలు సామాజిక దూరం పాటించారు. బైక్‌పై ఒకరికంటే ఎక్కువ మంది బయటికి వచ్చిన వాహనదారుకు పోలీసులు కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద అభ్యూదయ యూత్‌ ఆధ్వర్యంలో అన్నం ప్యాకెట్లను ఏసీపీ సత్తయ్య వాహనదారులకు పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని వారికి సూచించారు. తరుచుగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని, బయటికి వచ్చిన వారు సామాజిక దూరం పాటించాలన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. రోడ్లపైకి వస్తున్న ద్విచక్రవాహనదారులకు కరోనావైరస్‌పై అవగాహన కల్పించి తిరిగి ఇండ్లకు పంపించారు. లచ్చమ్మగూడెంలో సర్పంచ్‌ జెన్నీకోడి అలివేలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రామన్నపేట మండలంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎస్సై చిల్లా సాయిలు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మోత్కూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమితమయ్యారు. గ్రామ శివారుల్లో పోలీసులు ప్రత్యేకమైన చెక్‌పోస్టులుఏర్పాటు చేసి వివిధ పనుల నిమిత్తం ఇండ్లనుంచి బయటికి వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అత్యావసరమైతే తప్పా బయటికి రావొద్దని వారికి సూచించారు. అడ్డగూడూరు మండలంలోని గ్రామాల్లోకి ఎవరు రాకుండా గ్రామస్తులు ముళ్లకంపలు వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్థమానుకోట గ్రామంలో 6గురికి పాజిటివ్‌ కేసుల రావడంతో మండల ప్రభుత్వ యంతాంగ్రం అప్రమత్తమైంది. మండలంలోని లక్ష్మీదేవికాల్వ, ధర్మారం, కోటమర్తి గ్రామాలకు, వర్థమానుకోట మధ్య బిక్కేరు వాగు గ్రామానికి 4 కిలో మీటర్ల దూరం ఉండటంతో రాకపోకలు సాగుతాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు వర్థమానుకోటకు వెళ్లే అన్ని దారులను సోమవారం మూసివేయించారు. ఏసీపీ సత్తయ్య, తహసీల్దార్‌ రామకృష్ణ, ఎస్త్సె మహేశ్వర్‌ మూడు గ్రామాలను సందర్శించి ఆ గ్రామాలకు వెళ్లినవారు బయటికి రాకుండా హోంక్వారంటైన్‌లోనే ఉండాలని తెలిపారు. 

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : పారిశుధ్యంపై అయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా వైరస్‌రాకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో సర్పంచ్‌ కర్రె వెంకటయ్య  హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టారు. ఆత్మకూరు(ఎం)లో  వాహనదారులకు కరోనావ్యాధిపై  ఎస్సై ఇద్రీస్‌ అలీ అవగాహన కల్పించారు. తుర్కపల్లి మండలంలోని మాదాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్‌ వెళ్లివచ్చాడన్న అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకుని భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు.  వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచామని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు.  పిట్టలగూడెంలో హైకోర్టు న్యాయవాది శీలం అశోక్‌రెడ్డి సహకారంతో అందించిన ట్రాక్టర్‌ ద్వారా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆలేరు, గుండాల, మోటకొండూర్‌, బొమ్మలరామారం మండలాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు.

ప్రజలంతా ఇండ్లకే పరిమితం..

భువనగిరి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సోమవారం కొనసాగింది. ప్రజలు ఇండ్ల్లకే పరిమితమయ్యారు. పోలీసులు ఆయా మండల కేంద్రాల్లోని రహదారుల వద్ద వాహన తనిఖీలు, బందోబస్తు చేపట్టారు. భువనగిరి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోడియం హైడ్రోహైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వలిగొండ మండల కేంద్రంలో డీసీపీ నారాయణరెడ్డి బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎవరూ అతిక్రమించొద్దన్నారు. మండలంలోని వేములకొండ, నాగారం, ముద్దాపురం, నర్సాయగూడెం గ్రామాల్లో కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా సోడియం హైడ్రోహైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో లాక్‌డౌన్‌ యథాతధంగా కొనసాగింది.

VIDEOS

logo