శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Apr 07, 2020 , 00:13:04

కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు

కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు

భువనగిరి, నమస్తే తెలంగాణ : కరోనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కట్టుదిట్టంగా చేపట్టాలని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు.  సోమవారం తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులతో  ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. రైతులకు రోజు వారి కొనుగోలుకు సంబంధించి ముందుగానే టోకెన్లు జారీ చేసి అన్నిచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రెండు మాత్రమే తూకం వేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని, ఒక్కొక్క తూకం వద్ద ఆరుగురు హమాలీలు మాత్రమే ఉండాలన్నా రు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కరోనా నియంత్రణ కోసం సబ్బు, బకెట్‌, నీరు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. నోరు, ముక్కును కవర్‌ చేస్తూ మాస్కులు  లేదా గుడ్డ లేకుండా వ్యక్తులు బయట తిరుగరాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, తేమ కొలిచే సాధనాలు, గన్నీబ్యాగులు వెంటనే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలన్నారు.  జిల్లాలో కరోనా పాజిటీవ్‌ కేసులు లేవని, మాకు ఏమీ కాదు అని నిర్ల క్ష్యం చేయరాదన్నారు. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఉన్న దృష్ట్యా చుట్టాలు, బంధువుల ద్వారా సంక్రమించే అవకాశా లు ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించాలన్నారు. ఆసరా పింఛన్లు గతంలో బయోమెట్రిక్‌ బ దులుగా డీపీఎంల వేలిముద్ర ఆధారంగా బ్రాంచి పోస్టుమాస్టర్లు డ్రా చేసి ఇచ్చినచో డీపీఎంలు చెల్లిస్తారని, అంతేకాకుండా వీలైతే గ్రామ పంచాయతీ కార్యదరి, వీఆర్‌వో, వీఆర్‌ఏ, సర్పంచ్‌ టీములుగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయంపై గ్రామాల్లో టాంటాం చేయాలని కోరారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు జి.రమేశ్‌, కీమ్యానాయక్‌, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి   పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు 

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ వివిధ మండల, మున్సిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతోనే కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వారిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌  ఆదేశించినట్లు తెలిపారు. వారిని వెంటనే గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించారన్నారు. రబీలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు మండల వ్యాప్తంగా 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత  తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo