సోమవారం 01 మార్చి 2021
Yadadri - Apr 06, 2020 , 02:12:26

వెలుగుల ఐక్యత

వెలుగుల ఐక్యత

  • సరిగ్గా రాత్రి 9 గంటలకు విద్యుత్‌ దీపాలు ఆర్పివేత
  • నూనె దీపాలు, కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ లైట్లు వెలిగింత
  • ప్రధాన మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపుతో జిల్లావాసుల ఐక్యత
  • కరోనా వైరస్‌పై ఉమ్మడి పోరులో కలిసి సాగిన ప్రజలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్‌ దీపాలు ఆర్పేశారు. నూనె దీపాలు, కొవ్వొత్తులు, సెల్‌ ఫోన్‌ లైట్లు ఏకకాలంలో వెలిగించి కరోనా వైరస్‌పై పోరులో ఐక్యతను ప్రదర్శించారు. జిల్లా అంతటా పల్లెటూళ్లు, పట్టణాలు అన్న తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లల్లో సరిగ్గా రాత్రి 9 గంటలకు లైట్లను ఆఫ్‌ చేయడమే కాకుండా.. ఇండ్ల ముందు దీపాలు వెలిగించారు. అన్ని స్థాయి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మొదలు సామాన్య ప్రజలు సైతం ఈ ఐక్యతా యుద్ధంలో తమ వంతుగా భాగస్వామ్యం పంచుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు పట్టణాల్లోని పలు వీధులతోపాటు అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో వెలిగిన దీపాలతో ఆయా ప్రాంతాలు దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి.

VIDEOS

logo