బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Apr 05, 2020 , 03:30:19

కరోనా కట్టడికి రైతులు సహకరించాలి

కరోనా కట్టడికి రైతులు సహకరించాలి

  • ఐకేపీ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రంగనాథ్‌

నీలగిరి : కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రైతాంగం ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా సహకరించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ కోరారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి, శెట్టిపాలెం పరిధిలోని వసంత రైస్‌ మిల్లులో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు రైతులతో నేరుగా మాట్లాడి సౌకర్యాల ఏర్పాట్లు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తూకం కాంటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్‌ వెంటనే జరిగే విధంగా హమాలీల కొరత లేకుండా మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీటీసీ అదనపు ఎస్పీ సతీశ్‌, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ మహబూబ్‌బాషా, మిర్యాలగూడెం రూరల్‌ సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ దోరెపల్లి నర్సింహులు, సుధీర్‌ తదితరులున్నారు.  

VIDEOS

logo