శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Apr 03, 2020 , 01:30:32

విజయంవతంగా లాక్‌డౌన్‌

విజయంవతంగా లాక్‌డౌన్‌

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ :  చౌటుప్పల్‌ పరిధిలో గురువారం  లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగింది.  కిరాణం,మెడికల్‌షాపులు,  పెట్రోల్‌బంకులు, వాటర్‌ ప్లాంట్లు తప్ప అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. బైక్‌పై ఒకరికంటే ఎక్కువ మంది బయటికి వచ్చిన వాహనదారులకు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద పోలీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వస్తున్న వారిని తప్ప.. మిగితా వారిని టోల్‌ప్లాజా నుంచి వెళ్లేందుకు అనుమతించలేదు.   సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో  లాక్‌డౌన్‌లో భాగంగా  గ్రామపంచాయతీ సిబ్బంది,  సర్పంచ్‌ శ్రీహరి వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. రామన్నపేట, అడ్డగూడూరు, మోత్కూరు మండలాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. బయటికి వచ్చిన వాహనదారులకు కరోనా పోలీసులు అవగాహన కల్పించారు.

ఉచిత బియ్యం పంపిణీ..

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో సర్పంచులు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం, ప్రతి కార్డుపై రూ.1,500లు ప్రభుత్వం అందజేస్తున్నదని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లిలో గురువారం రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్‌ ఎరుకల సుధతో కలిసి ఆయన ప్రారంభించారు. మోటకొండూర్‌ మండల కేంద్రంలో సర్పంచ్‌ శ్రీలత ఫైర్‌ ఇంజన్‌ సాయంతో సోడియం హైపోక్లోరైట్‌ మిశ్రమాన్ని పిచికారీ చేశారు. తుర్కపల్లి మండలంలో ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. గుండాల మండలంలోని గంగాపురంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్‌ సైదులు ప్రారంభించారు. సుద్దాల తదితర గ్రామాల్లో కరోనా వైరస్‌పై మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. ఆలేరు మండలంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగింది. కొలనుపాక, రాఘవపురం, శ్రీనివాసాపురం, శారాజీపేట గ్రామాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. బొమ్మలరామారం మండలంలోని సోలిపేట గ్రామంలో సర్పంచ్‌ నవీన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ మిశ్రమాన్ని పిచికారీ చేశారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీలోని 60 కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు, రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ దశరథ గౌడ్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాజాపేట, ఆలేరు పట్టణం, తుర్కపల్లి మండలాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా సాగుతున్నది. 

లాక్‌డౌన్‌ యథాతథం..

భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఆదేశాలతో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ గురువారం భువనగిరి నియోజకవర్గంలో కట్టుదిట్టంగా అమలవుతున్నది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. భువనగిరి పట్టణంతోపాటు, మండలంలోని పలు గ్రామాల్లో లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పట్టణ సీఐ సుధాకర్‌కు మాస్కులను అందజేశారు. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయగిరి గ్రామ సమీపంలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో సరుకులు అందజేశారు. వలిగొండ మండలంలోని అన్నిగ్రామాలతోపాటు, మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింది. బీబీనగర్‌ మండలంలో లాక్‌డౌన్‌ కొనసాగింది. కొండమడుగు గ్రామానికి చెందిన గంజి సాయి తన తండ్రి శ్రీశైలం జ్ఞాపకార్థం పోలీసులకు, వైద్య సిబ్బందికి, వలస కార్మికుల దాహార్తిని తీర్చేందుకు దాదాపు 2 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రావిపహాడ్‌లో మొగ్దుంపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్‌గౌడ్‌, రాఘవాపురంలో టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మాస్కులు అందజేశారు. భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంతోపాటు అన్నిగ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది.

VIDEOS

logo