మంగళవారం 14 జూలై 2020
Yadadri - Mar 31, 2020 , 22:43:21

శభాష్‌ సర్పంచ్‌

శభాష్‌ సర్పంచ్‌

రాజాపేట : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామస్తుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు రాజాపేట మండలం నర్సాపురం సర్పంచ్‌ నాగిర్తి గోపిరెడ్డి. కరోనా మహమ్మారిపై గ్రామస్తులకు సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలో వ్యాప్తి చెందకుండా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు. గడపగడపకూ తిరుగుతూ స్వీయ నిర్బంధంలో ఉండాలని గ్రామస్తులను వేడుకుంటున్నాడు.  ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వైద్యులకు సమాచారం ఇచ్చి హోం క్వారంటైన్‌ చేయిస్తున్నాడు. గ్రామం మీదుగా వెళ్లే వాహనదారులను అడ్డుకొని బయట తిరగొద్దని దండం పెట్టి మరీ చెప్తున్నాడు. అంతేకాక  న్యాయవాది శీలం అశోక్‌రెడ్డి ఇస్తున్న సహకారంతో గ్రామంలోని అన్ని వాడల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ పలువురిచే శభాష్‌ అనిపించుకుంటున్నాడు.


logo