ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Mar 30, 2020 , 23:14:58

కూలీల భద్రతకు చర్యలు

కూలీల భద్రతకు చర్యలు

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ 

భువనగిరి,నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ దృష్ట్యా కూలీలు, వలస కూలీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. అందులో భాగంగా బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేస్తున్నదన్నారు. భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కూలీలకు సోమవారం రాత్రి బియ్యం, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలస కూలీలు ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 25,594మంది వలస కూలీలను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, అదనపు కలెక్టర్లు రమేశ్‌, కీమ్యానాయక్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo