ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Mar 30, 2020 , 00:35:31

సర్వీస్‌ రోడ్డు మీదకు రాకుండా వ్యాపారాలు చేసుకోవాలి

సర్వీస్‌ రోడ్డు మీదకు రాకుండా వ్యాపారాలు చేసుకోవాలి

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ: సర్వీస్‌ రోడ్డు మీదకు రాకుండా చిరువ్యాపారులు వ్యాపారాలు చేసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం చౌటుప్పల్‌లోని సర్వీస్‌ రోడ్డులో వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అడ్డాలను సర్వీస్‌ రోడ్డు మీదకు రాకుండా చూసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను చిరువ్యాపారులు కచ్చితంగా పాటించాలన్నారు. సాయంత్రం ఆరు లోపే దుకాణాలను బంద్‌ చేయాలన్నారు. కొనుగోలు దారులు సామాజిక దూరం పాటించాలన్నారు. 

చిరువ్యాపారులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు..

చిరువ్యాపారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా చౌటుప్పల్‌లో సర్వీస్‌రోడ్డకు ఇరువైపులా వ్యాపార సముదాయాలను ఖాళీ చేయాలని అధికారులు చిరువ్యాపారులకు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఆదివారం చిరువ్యాపారులతో సమావేశమయ్యారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని చిరువ్యాపారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ చేసేందుకు కొంత సమయాన్ని ఇవ్వాలని జీఎంఆర్‌ అధికారులను కోరారు. 

VIDEOS

logo