మంగళవారం 14 జూలై 2020
Yadadri - Mar 30, 2020 , 00:32:31

లాక్‌డౌన్‌కు సహకరించాలి

లాక్‌డౌన్‌కు సహకరించాలి

  • డీసీపీ నారాయణరెడ్డి 

రామన్నపేట: ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని, అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన సందర్శించారు. వాహనాల రవాణా అనుమతి పత్రాలను పరిశీలించారు. సరుకు రవాణాకు అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు. బైక్‌లపై తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అంతేకాక రామన్నపేట మండల కేంద్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను పరిశీలించారు. మెడికల్‌, కిరాణం, కూరగాయల దుకాణాల ఎదుట సామాజిక దూరం పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. వ్యాపారులు అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు. డీసీపీ వెంట సీఐ ఎవీ.రంగా, ఎస్సై చిల్లా సాయిలు, ఏఎస్సైలు హన్మంతరావు, సైదులు, బల్లూసింగ్‌ ఉన్నారు. 


logo