లాక్డౌన్ విజయవంతం..

- సామాజిక దూరంపై అవగాహన
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : చౌటుప్పల్ మండలంలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. కిరాణాషాపులు, పెట్రోల్‌బంకులు, ఏటీఎంలు, వాటర్ ప్లాంట్ల ఎదుట సామాజిక దూరం పాటించేలా నిత్యావసర ధరల స్థిరీకరణ టీమ్ సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో మాస్కులు కట్టుకున్న వాహనదారులకు మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించారు. కూరగాయల మడిగల ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణాన్ని స్ప్రే చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. వద్ద అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన స్థానికులను మాత్రమే తమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతించారు. మిగితా వారికి కరోనాపై అవగాహన కల్పించి వారి ఇండ్లకు పంపించారు. అన్ని గ్రామాల్లో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు.
సంస్థాన్‌నారాయణపురం మండలంలో..
సంస్థాన్‌నారాయణపురం మండలంలో లాక్డౌన్ విజయవంతం అయింది. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. బయటికి వచ్చిన వారికి కరోనాపై పోలీసులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని 1,2 వార్డుల్లో ఎంపీటీసీ గాలయ్య ఇంటింటికీ కూరగాయాలు పంపిణీ చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ముగ్గురికి వైద్యాధికారి దీప్తి క్వారంటైన్ స్టాంప్ వేసి హోమ్ ఐసోలేషన్‌కు తరలించారు. వారిని ఇండ్లకే పరిమితం కావాలని, బయట తిరుగొద్దని సూచించారు.
రామన్నపేట మండలంలో..
రామన్నపేట మండలంలో విజయవంతంగా లాక్డౌన్ కొనసాగుతున్నది. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారికి సామాజిక దూరంపై పోలీసులు అవగాహన కల్పించారు. కరోనా నివారణకు మాస్కులు ధరించాలని, సానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ
జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ లక్ష్మినర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో మాస్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ కోసం మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. స్వీయ గృహనిర్బంధంతోనే కరోనా వైరస్ మటుమాయం కానుందని ప్రజలు తమవంతుగా సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో ట్రాక్టర్, ఆటో డ్రైవర్లు, స్థానికులకు శ్యాంశెట్టి రమేశ్‌గుప్తా మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల సత్యనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ప్రతినిధులు బుంగపట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు నిర్వహించిన లాక్డౌన్ మోత్కూరు మండలంలో ఆరో రోజు శనివారం విజయవంతంగా కొనసాగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మెడికల్ దుకాణాలు, దవాఖానలు మాత్రమే తెరిచి ఉంచారు. కిరాణాదుకాణాలు, పెట్రోల్ బంకులు, కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించారు. ఎస్ఐ సీహెచ్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని పోలీస్ చెక్‌పోస్టు వద్ద మాస్కులు ధరించని, అవసరం లేక పోయినా రహదారుల వెంట బైక్‌లపై విహరించే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మండల, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. బయటికి వస్తున్న ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు చేశారు. ఇతర దేశాల, రాష్ర్టాల నుంచి వచ్చిన వారి కదలికలపై పోలీసులు, అధికారులు నిఘా పెంచారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో, ప్రధాన రహదారుల వెంట సోడియం హైపోక్లోరైడ్‌ను చైర్పర్సన్ తిపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, కమిషనర్ పొరెడ్డి మనోహర్‌రెడ్డి చేసి స్ప్రే చేయించారు.
అడ్డగూడూరు మండలంలో..
అడ్డగూడూరు మండలంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ శనివారం కూడా మండలంలో విజయవంతమైంది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇతర దేశాలు రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను డాక్టర్ నరేశ్ ఆధ్వర్యంలో గుర్తించి, వారికి క్వారంటైన్ ముద్రలు వేసి 14 రోజులపాటు ఇంట్లో నుంచి బయటికి రావద్దని సూచించారు. కంచనపల్లి ఆవాస గ్రామమైన కమ్మగూడెంలో జర్మనీ నుంచి వ్యక్తి ఫోన్ నెంబర్‌ను జియో ట్యాగింగ్ చేసినట్లు డాక్టర్ నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, సర్పంచ్ పరమేశ్ పాల్గొన్నారు.
కరోనా కట్టడికి అందరూ సహకరించాలి
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట : కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ సహకరించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. రామన్నపేటలో కరోనా కట్టడి కోసం వివిధ శాఖలు చేస్తున్న పనితీరును శనివారం ఆయన వేర్వేరుగా సమీక్షించారు. రేషన్ పంపిణీ సందర్భంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వీలయినంతవరకు రైతులు ధాన్యాన్ని తమ బావుల వద్దే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని కోరారు. మండలంలోని సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు రూ.4లక్షలను సీఎం సహాయనిధికి విరాళంగా అందజేశారు. రామన్నపేట జెడ్పీటీసీ లక్ష్మి రూ.50వేలు, వెల్లంకి సర్పంచ్ మహేందర్‌రెడ్డి రూ.60వేలు, బోగారం సర్పంచ్ పద్మ రూ.60వేలు, వెల్లంకి ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి రూ.50వేలు, నిధానపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి రూ.30వేలు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సత్తయ్యయాదవ్ రూ.30వేలు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దుర్గయ్య రూ.30వేలు, సింగిల్‌విండో చైర్మన్ భిక్షంరెడ్డి రూ.20వేలు, సిరిపురం సర్పంచ్ లక్ష్మీనర్సు రూ.20వేలు, విద్యాసాగర్‌రెడ్డి -శ్రీధర్‌రెడ్డి రూ.20వేలు, రామన్నపేట సర్పంచ్ శిరీష రూ.10వేలు, ఇంద్రపాలనగరం సర్పంచ్ సిద్దమ్మ, రూ.10వేలు, లక్ష్మాపురం సర్పంచ్ ప్రకాశ్ రూ.10వేలు, రామన్నపేట ఎంపీటీసీ రెహాన్ రూ.10వేలు, జనంపల్లి సర్పంచ్ రేఖ రూ.10వేలు, బాచుప్పల సర్పంచ్ క్రిష్ణవేణి రూ.5వేలు, వార్డుసభ్యురాలు జహేరాబేగం రూ.2వేలు నగదు, చెక్కులరూపంలో అందజేశారు.
తాజావార్తలు
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు