గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Mar 25, 2020 , 22:58:00

శభాష్‌ పోలీస్‌..

శభాష్‌ పోలీస్‌..

  • ఉమ్మడి జిల్లా పోలీసులంతా విధుల్లో బిజీబిజీ...
  • ఉగాది పండుగపూట వీధుల్లోనే గస్తీ
  • కరోనాపై లాక్‌డౌన్‌ యుద్ధంలో పోలీసుల కీలక పాత్ర
  • నచ్చచెబుతూ, కఠినంగా వ్యవహరిస్తూ భిన్న పాత్రలు

రోడ్డెక్కిన వారికి నచ్చచెబుతున్నారు.. మాట వినని వారితో కఠినంగా వ్యవహరిస్తున్నారు.. నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తున్నారు.. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే లాఠీలు ఝళిపిస్తున్నారు.. కరోనా వైరస్‌ పారదోలేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే ఉమ్మడి జిల్లాలోని పోలీసులంతా నిత్యం వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌, యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి సహా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు... ప్రతి ఒక్కరూ విధుల్లోనే ఉంటున్నారు. పండుగ పూట సైతం ప్రతి పోలీసు బాధ్యతలు నిర్వహించారు. కరోనాపై ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

- నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

VIDEOS

logo