మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Mar 23, 2020 , 23:16:50

‘పేట’ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

‘పేట’ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

  • కరోనా వైరస్‌పై సూచనలు, సలహాల కోసం ఏర్పాటు
  • జిల్లా అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి 

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డి తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-1972, ఫోన్‌ నెంబర్లు 08684-231008, 231032, 231033, 231034లను సంప్రదించాలని సూచించారు.

 సూర్యాపేట, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు సూ ర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డి తెలిపారు.  జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు  కరోనా వైరస్‌ దృష్ట్యా ప్రజల ఫిర్యాదులు, సలహాలు, సందేశాలు తక్షణమే నివృత్తి చేయడాని కి కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెవె న్యూ, పోలీసు,  వైద్యఆరోగ్యశాఖ వారిచే మూడు విడు తల వారీగా సిబ్బంది 24గంటలు విధుల్లో అందుబాటులో ఉంటారన్నారు. ఫిర్యాదులు సందేహాల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-42 5-1972, ఫోన్‌ : 08 684-231008, 2310 32, 231033, 231 034లకు ఫోన్‌ చేసి వివి ధ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కంట్రోల్‌ రూం లో ఫిర్యాదులు సంబంధించి రిజిస్టర్‌ల్లో వివిధ సమస్యల వివరాలను తప్పక నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే జిల్లాలోని ప్రతి కార్యాలయంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని కరోనా వైరస్‌ దృష్ట్యా అధికారులు, సిబ్బంది తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఏఓ ప్రద్యుమ్న, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo