ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Mar 21, 2020 , 22:51:03

భువనగిరిని మరింతగా అభివృద్ధి చేస్తా

భువనగిరిని మరింతగా అభివృద్ధి చేస్తా

  • పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలి 
  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 
  • భువనగిరి మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం   

భువనగిరి అర్బన్‌ : భునవగిరి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భునవగిరి మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో 2020-21 సంవత్సరానికిగాను రూ.51.98 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో గుర్తించి నమో దు చేసుకున్న పనులను పరిష్కరించాలన్నారు. వార్డుల్లో అసంపూర్తిగా జరిగిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెం టనే పూర్తి చేయించుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలు చేపట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని అధికారులను, కౌన్సిలర్లుకు సూచించారు. 

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

ప్రతి వార్డులోని పరిసరాలను పరిశుభ్రం గా ఉండేలా చూడాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కరోనా గురించి ఎ లాంటి భయాందోళన చెందవద్దని ముం దస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, దుస్తులు అందజేయాలని ము న్సిపల్‌ అధికారులకు సూచించారు. కరో నా వైరస్‌ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి వార్డులోని ఆపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి దోమలు, ఈగల నివారణ మందులను చల్లించాలని తెలిపారు. ప్రతి వార్డులో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కరోనా వైరస్‌ కారణం తో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి కి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, కమిషనర్‌ నాగిరెడ్డి, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌ న్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, అవంచకక్రాంతి, ఎల్లమ్మ, నాయిని అరుణ, కిరణ్‌కుమార్‌, అనురాధ, దిడ్డికాడి భగత్‌, స్వా మి, జి.అంజమ్మ, వడిచెర్ల లక్ష్మి, పచ్చల హేమలత, ఊదరి లక్ష్మి, కడారి ఉమాదేవి, పడిగెల రేణుక, జనగాం కవిత, నజీయనస్రీన్‌, కోళ్ల దుర్గాభవాని, బొర్ర రాకేశ్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo