శనివారం 06 మార్చి 2021
Yadadri - Mar 09, 2020 , 00:19:43

మహిళలు ఆర్థికంగా ఎదుగాలి

మహిళలు ఆర్థికంగా ఎదుగాలి
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి అర్బన్‌: మహిళలు వ్యాపార దృక్పథాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదుగాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాబార్డు, రైతు ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో స్థానిక రావిభద్రారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పిలుపు, పీస్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తుల అమ్మకం ముగింపు ప్రదర్శనలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  రైతులు లాభసాటి పంటలను ఎంచుకొని సాగు చేయాలన్నారు. మహిళలు ఎదగడానికి ప్రభుత్వం అనేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. మహిళా రైతులు చిరు ధాన్యాలు, కూరగాయలు పెంచి లాభాలను పొందాలన్నారు. అనంతరం ఎఫ్‌ఏవో తీర్మానించిన మెనిఫెస్టో, దిశాలి మహిళా రైతుల కంపనీల షేర్‌ సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రైతులను సన్మానించారు. ఇదిలా ఉంటే రైతు ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 స్టాళ్లను సందర్శించి అమ్మకాలు, వచ్చిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీస్‌ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన రాగి లడ్డూలు, రాగి జావ, సజ్జ అరిసెలు ఎంతో బాగున్నాయన్నారు. 


మహిళా రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం 

-నాబార్డు జిల్లా మేనేజర్‌ సత్యనారాయణ 

 మహిళా రైతులకు వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు నాబార్డు సిద్ధంగా ఉందని  నాబార్డు జిల్లా మేనేజర్‌ సత్యనారాయణ అన్నారు.  శిక్షణ పొందిన మహిళలు సీజన్‌ బట్టి పంటలు సాగు చేసి లాభాలు గడించాలన్నారు. మహిళా రైతులు ఉద్యాన పంటలపై ఆసక్తి పెంచుకుంటే ఆర్థికంగా స్థిరపడవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి సురేష్‌కుమార్‌, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగార్జున, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, మహిళా కిసాన్‌ అధికారి ఉష శ్రీలక్ష్మి, పీస్‌ సంస్థ డైరెక్టర్‌ కె.నిమ్మయ్య, పిలుపు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రుద్రమాదేవి, పీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.అరుణ, సంస్థల సిబ్బంది వి.స్వామి, చారి, బాలచారి, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రమేష్‌, రాంమూర్తి, గోపినాథ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు.

VIDEOS

logo