లాభసాటి ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి

భువనగిరి అర్బన్: మహిళా రైతు ఉత్పత్తిదారులు లాభసాటి కంపెనీలను ఎంపిక చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. అజీవ, దిశాళి మహిళా రైతు ఉత్పత్తిదారుల సభ్యులతో స్థానిక పీస్ సంస్థ, గ్రామీణ మహిళా మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో రైతు ఉత్పత్తి దారుల సమన్వయ సమావేశం స్థానిక పశుసంవర్థక శాఖలో శుక్రవారం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ అనితారామచంద్రన్ మాహిళా రైతులు పండించే పంటలు, ఎంత మేరకు లాభం వస్తుంది, ఏ పంటలపై ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారని మహిళా సంఘాల, మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, మహిళా సంఘాల సభ్యులు ఏకమై ఎఫ్‌పీవో (రైతు ఉత్పత్తిదారుల సంఘం) ద్వారా వ్యాపారంలో ప్రగతి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉధ్యానవన అధికారి సురేశ్‌కుమార్, యాదగిరిగుట్ట వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మావతి, నాబార్డు ఏజీఎం సత్యనారాయణ, గ్రోమోర్ మార్కెటింగ్ ఆఫీసర్ నర్సింహరావు, ఏపీఎంఏఎస్ కో-ఆర్డినేటర్ కిశోర్‌కుమార్, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి కృష్ణ, పీస్సంస్థ డైరెక్టర్ నిమ్మ య్య, పీస్ సిబ్బంది శ్రీనివాస్, హరినాయక్, మహేశ్, విష్ణు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది