ఘనంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

భూదాన్‌పోచంపల్లి : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోచంపల్లి మండల పరిధి జూలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో గురువారం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ముస్తాబు చేసిన రథంపై స్వామిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం రాత్రి గ్రామంలో రేలారే రేలా ధూం ధాం నిర్వహించారు. ప్రముఖ జానపద గాయని గంగ, గాయకుడు శివనాగులు పాడిన పాటలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ యాకరి రేణుకానర్సింగ్రావు, ఎంపీటీసీ బొచ్చు శంకరమ్మకిష్టయ్య, భువనగిరి మార్కెట్ కమిటీ డైరక్టర్ ఐతరాజు భిక్షపతి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు వట్టిపల్లి బాల్‌రాజు, బందారపు లక్ష్మణ్, వాకిటి మల్లారెడ్డి, కొమిరె భాస్కర్, ప్రభాకర్, దిండు శశాంక్, చిలువేరు వెంకటేశం, ఐతరాజు నరేశ్, దుర్గం నర్సింహ, తవి టి బస్వయ్య, కొత్తపల్లి శ్రీశైలం, పాముకుంట్ల బస్వయ్య, సంజీవ, సందెన కిషన్, చిలువేరు ఐలయ్య, పొలమోని జంగయ్య, గణేశ్, నాగేశ్, యాదిరెడ్డి, రాజు, కిరణ్, శ్రవన్, ప్రభాకర్, లింగస్వామి, శ్రీను, బస్వయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సాగర్ టికెట్ ఎవరికి?
- చేసిన ఒక్క మేలు చెప్పండి
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై