సోమవారం 01 మార్చి 2021
Yadadri - Mar 05, 2020 , 23:36:48

పథకాలను నూరుశాతం ్రగ్రౌండింగ్‌ చేయాలి

పథకాలను నూరుశాతం ్రగ్రౌండింగ్‌ చేయాలి

భువనగిరి,నమస్తే తెలంగాణ : బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న పథకాలను నూరు శాతం గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి నిర్వహించిన బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను గుర్తించి లబ్ధిదారులకు అన్ని ప్రోత్సాహకాలు అందించాలన్నారు. గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసే ట్రాక్టర్లకు వెంటనే రుణ సౌకర్యం కల్పించాలన్నారు. మహిళా సంఘాలు, చేనేత కార్మికులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించేందుకు బ్యాంకర్లు సాయం చేయాలన్నారు. జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ పంట నష్టం జరిగిన వెంటనే ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందేలా బ్యాంకర్లు చూడాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఏజీఎం ఫణిందర్‌కుమార్‌, నాబార్డు డీజీఎం సత్యనారాయణ, ఎస్‌బీఐ రీజినల్‌ ఆఫీస్‌ ప్రతినిధి దినేష్‌, ఎల్‌డీఎం నాగార్జున బాబు, డీసీసీబి మేనేజర్‌ నర్మద, కంట్రోలింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo