గురువారం 04 జూన్ 2020
Yadadri - Mar 05, 2020 , 00:01:51

ముస్తాబవుతున్న మత్స్యాద్రి

ముస్తాబవుతున్న మత్స్యాద్రి
  • 7 నుంచి నూతన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
  • ఏర్పాట్లు ముమ్మరం
  • ప్రముఖులకు ఆహ్వానం

వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్న శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు ముస్తాబవుతున్నది. దేవస్థానం కొండపై 7వ తేదీ నుంచి 12 వరకు ఆలయంలో ధృవమూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్య్రమాలు నిర్వహించనునున్నట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు ప్రీతి పాత్రులు కావాలని కోరారు. 


logo