మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Mar 03, 2020 , 00:15:43

యువనేత కేటీఆర్‌ను కలిసిన చైర్మన్లు.. పాలకవర్గం సభ్యులు

యువనేత కేటీఆర్‌ను కలిసిన చైర్మన్లు.. పాలకవర్గం సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌  చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టి  జానయ్య, వైస్‌ చైర్మన్‌  దుర్గంపూడి నారాయణరెడ్డి యువనేతకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అరణ్యభవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి శ్రీవారి ప్రసాదం అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కూడా కలిసి శాలువాతో సత్కరించి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి ప్రసాదం అందజేశారు. జిల్లాకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

VIDEOS

logo