శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Feb 27, 2020 , 23:57:18

10 క్వింటాళ్లకు మించి కందులు కొనుగోలు చేయొద్దు

10 క్వింటాళ్లకు మించి కందులు కొనుగోలు చేయొద్దు
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి, నమస్తే తెలంగాణ : కందుల కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నుంచి 10 క్వింటాళ్లకు మించి కందులను కొనుగోలు చేయొద్దని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ జి.రమేశ్‌, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారులు, పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకారశాఖల అధికారులతో గురువారం సమావేశమై కందుల కొనుగోలు తీరును సమీక్షించారు. సాగు ధ్రువీృకరణ పత్రం పొంది ఉండి, టోకెన్‌ కలిగి ఉన్న వారు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు కందులు తీసుకురావాలని, కొత్త వారు తిరిగి టోకెన్లు పొందిన తర్వాత మాత్రమే కందులను కొనుగోలు కేంద్రాలకు తేవాలని కలెక్టర్‌ కోరారు. సాగు ధ్రువీృకరణ పత్రాలతో తదుపరి టోకన్లను జారీ చేస్తామని, ప్రస్తుతం ఇప్పటికే టోకెన్లు కలిగి ఉన్న కంది రైతులు మాత్రమే కందిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. ఈమేరకు రైతులకు విస్తృత అవగాహన కలిగించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కందుల కొనుగోలు కోసంజిల్లాలో మోత్కూర్‌, మోటకొండూరు, ఆలేరులలో జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు 1,197 మంది రైతుల నుంచి 14వేల 154 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశామని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకారశాఖల అధికారులు పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి : కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

బొమ్మలరామారం: నాటిన ప్రతీ మొక్క ను సంరక్షించాలని కలెక్టర్‌ అనితా రామ చంద్రన్‌ అన్నారు. మండలంలోని హాజీ పూర్‌ గ్రామంలో గు రువారం నిర్వహిం చిన ముఖాముఖి కా ర్యక్రమానికి హాజ రైన కలెక్టర్‌ నర్సరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా నర్సరీలో మొక్కల పెంపకంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకు అవసరమయ్యే మొక్కల పెంపకంలో ప్రణాళిక లేకుండా నర్సరీ పెంపకంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటేందుకు గ్రీన్‌ ప్లాన్‌ ప్రణాళికల రికార్డులను రూపొందించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హనుమంతు నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్‌ నోటీసులు పంపాలని ఎంపీడీఓ శేషాద్రిని ఆదేశించారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షిం చుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ పద్మసుందరి, ఎంపీడీఓ శేషాద్రి, ఎంపీఓ గీతారెడ్డి, సర్పంచ్‌ కవితావెంకటేశ్‌, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరులు ఉన్నారు.


logo