శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Feb 27, 2020 , 00:09:04

జోరందుకున్న ‘పట్టణ ప్రగతి’

జోరందుకున్న ‘పట్టణ ప్రగతి’

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: పట్టణాలు ప్రగతి బాట పట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యాచరణ పనులు జోరుగా సాగుతున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని 12 వార్డుల్లో కౌన్సిలర్లు బుధవారం తమ తమ వార్డుల్లో పారిశుధ్య పనులను చేపట్టారు. వీధులను శుభ్రం చేశారు. మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టారు. పిచ్చి మొక్క లు తొలగించారు. శిథిలావస్థలో ఉన్న ఇం టి యజమానులకు, అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలా యజమానులకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌, మండల ప్రత్యేకాధికారి సురేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రజిత, వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, కౌన్సిలర్లు నాగరాజు, మమతాసాయి యాదవ్‌, సురేందర్‌, విజయలక్ష్మి, ప్రత్యేకాధికారులు ఏవో రాజేశ్‌కుమార్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. 


5 వ వార్డులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ..

యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డు లో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆకస్మి క తనిఖీ చేపట్టారు. వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా ఆమె వార్డుల్లో తి రుగుతూ సమస్యలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మా ట్లాడుతూ వార్డులో పారిశుధ్య పనులు చేపట్టి వార్డులను సుందరవనంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. వార్డు కౌన్సిలర్‌ వాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రజిత ఉన్నారు.     


logo