మనం మారుదాం..మన పట్టణాన్ని మార్చుకుందాం...

- dతో కలిసిరండి.. అభివృద్ధికి సహకరించండి : ప్రజలకు కేటీఆర్ పిలుపు
- రోజుల్లో చెత్త సేకరణకు ప్రతి ఇంటికి రెండు బుట్టల పంపిణీ
- కౌన్సిలర్లు బాధ్యతలను విస్మరిస్తే పదవులు ఊడిపోవడం ఖాయం
- పట్టణం నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు..
- ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్
- మర్చిపోలేని రోజు : ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, నమస్తేతెలంగాణ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం దేవరకొండ పట్టణంలోని 9, 10వార్డుల్లో పర్యటించి సమస్యలను దగ్గరుండి పరిశీలించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల పర్యటన అనంతరం స్థానిక సాయిరమ్య ఫంక్షన్ హాల్లో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. ఇంకా నాలుగేండ్లపాటు ఏ ఎన్నికలు లేవని, ఇక ప్రజా ప్రతినిధులంతా ప్రజల బాగోగుల కోసం పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి ఇంటి సమీపంలో ఓ ప్లాటు వద్ద అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పారిశుధ్య ప్రణాళికను రూపొందించుకుని దేవరకొండ పట్టణాన్ని ఆరు నెలల్లో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం పట్టణంలోని ఎనిమిది వేల ఇండ్లకు రెండేసి చెత్త బుట్టలను నాలుగైదు రోజుల్లోనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పొడి చెత్తతో స్థానిక మెప్మా సిబ్బంది లక్ష రూపాయల మేర ఆదాయం సమకూర్చుకునే సౌలభ్యం ఉందని, ఇప్పటికే సిరిసిల్లలో అమలవుతున్న ఈ విధానాన్ని చూసి అవగాహన పెంచుకోవాలన్నారు.
దేవరకొండ పట్టణాభివృద్ధికి ఏడాదికి సరాసరి రూ.6.26కోట్ల నిధులు వస్తున్నాయని, అందులో పది శాతం నిధులను మొక్కలను నాటడంతో పాటు పరిరక్షణకు కేటాయించాలన్నారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు బతికి ఉండకపోతే మీ పదవులు ఉండవని హెచ్చరించారు. దేవరకొండ పట్టణంలో తక్షణమే 100పబ్లిక్ టాయ్లెట్లు నిర్మించాలని, ఇందులో సగం మహిళలకు, సగం పురుషులకు ఉండేలా చూడాలన్నారు. సఫాయి సిబ్బంది పరిచయ కార్యక్రమాన్ని కూడా అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ప్రారంభించనునట్లు మంత్రి తెలిపారు. సఫాయి సిబ్బందిని గౌరవించి వార్డు ప్రజలు సాటి మనిషిగా చూడాలని, పారిశుధ్య సమస్యల కోసం ఇకపై కమిషనర్‌తో సంబంధం లేకుండా సఫాయి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేలా ఆయా వార్డుల్లో గోడలపై ఆయా సఫాయి కార్మికుని పేరును, ఫోన్ నెంబర్‌ను రాయించాలన్నారు. వార్డుల్లో పర్యటన సందర్భంగా గతంలో ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరఖ్ తేడా ఉందని, మంచినీటి సమస్య, కరెంటు సమస్యలు ఇప్పడు లేవని మంత్రి పేర్కొన్నారు.
వార్డు పర్యటనలో ప్రజల చాలావరకు రోడ్లు, మురికి కాలువల నిర్మాణాల గురించే ఏకరువు పెట్టారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. కోతుల బెడద మాత్రం స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అధికారులే పరిష్కరిస్తారని చెప్పారు. దేవరకొండ పట్టణంలోని 9, 10వార్డులలో వక్ఫ్ బోర్డు భూముల సమస్య ఉందని, ఇప్పటికే ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇప్పించి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. దీనిపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు సూచించారు. దేవరకొండ పట్టణంలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా మొత్తం అమలు చేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని రకాల చిరు వ్యాపారుల అవసరార్థం బస్టాండ్ పక్కన ఉన్న ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ దేవరకొండ పట్టణాభివృద్ధికి అడిగిన వెంటనే గతంలో పెద్దమొత్తంలో నిధులు మంజూరుచేసిన కేటీఆర్‌కు పట్టణ ప్రజానీకం రుణపడి ఉంటుందన్నారు. కేటీఆర్ దేవరకొండ పట్టణంలో మాతో పాటు నడిచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం మర్చిపోలేని రోజని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో సమీకృత మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంకోసం రూ.25కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, తేర చిన్నపరెడ్డి, మదర్ డైరీ ఛైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, 9, 10వార్డుల కౌన్సిలర్లు హన్మంతు వెంకటేష్ గౌడ్, జయప్రకాశ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు వడ్త్య దేవేందర్ నాయక్, మంజ్యానాయక్, ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- ఇంకా నాలుగేండ్లపాటు ఏ ఎన్నికలు లేవు.. ప్రజా ప్రతినిధులంతా ప్రజల బాగోగుల కోసం పని చేయాల్సిందే.
- గ్రీన్ యాక్షన్ కమిటీలు, పారిశుధ్య ప్రణాళిక రూపొందించుకుని దేవరకొండను ఆరు నెలల్లో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకోవాలి.
- దేవరకొండ పట్టణాభివృద్ధికి సాలీనా విడుదలవుతున్న రూ.6.26కోట్లలో పది శాతం మొక్కల పరిరక్షణకు కేటాయించాలి.
- చిరు వ్యాపారుల అవసరార్థం బస్టాండ్ పక్కన ఉన్న ఐదెకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తాం.
తాజావార్తలు
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్‌గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్‌కట్ సరిచేసిన వైనం