గురువారం 04 మార్చి 2021
Yadadri - Feb 25, 2020 , 23:31:50

పట్టణ ప్రగతిలో అందరూ పాలుపంచుకోవాలి

పట్టణ ప్రగతిలో అందరూ పాలుపంచుకోవాలి

- మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : పట్టణ ప్రగతిలో అందరూ పాలుపంచుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. 16వ వార్డులో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించారు. వార్డుల్లో పేరుకు పోయిన చెత్తాచెదారాన్ని ఆయనే స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పట్టణాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకే ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడన్నారు. తమ పట్టణాలు తామే అభివృద్ధి చేసుకునేందుకు ఇదో మంచి వేదిక అని తెలిపారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలన్నారు. మున్సిపాలిటీ సమాగ్రాభివృద్ధే ధ్యేయంగా పట్టణ ప్రణాళిక చేపడుతామన్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి విడుతల వారీగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ రాందుర్గారెడ్డి, కానుగు వెంకటయ్య, ఎండీ.ఘనీ పాల్గొన్నారు. 

VIDEOS

logo