సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 25, 2020 , 03:08:19

నేడు దేవరకొండకు మంత్రి కేటీఆర్‌

నేడు దేవరకొండకు మంత్రి కేటీఆర్‌
  • పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
  • రూ.48కోట్ల అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ మంగళవారం దేవరకొండ పట్టణంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉదయం 11గంటలకు డిండి రోడ్డులో రూ.48కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్క్‌, సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 11.15గంటలకు 9, 10వ వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు సాయిరమ్య ఫంక్షన్‌హాల్‌లో వార్డుల కమిటీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొంటారు. 1.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తికి వెళ్లనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. 

VIDEOS

logo