శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 25, 2020 , 02:17:30

సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి

సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

ఆలేరుటౌన్‌:  సమస్య  పరిష్కారానికే  పట్టణ ప్రగతిని ప్రభుత్వం చేపట్టిందని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. సోమవారం ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో ఆమె  పట్టణ ప్రగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పట్టణంలోని పలు వార్డుల్లో  నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే 60 రోజుల్లోగా పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి పట్టణం మోడల్‌టౌన్‌గా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి చేపట్టినట్లు తెలిపారు.    పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఆలేరు పట్టణంలో వార్డుల కమిటీలు వేశామని, ప్రజల సమస్యలను గుర్తించి  పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆమె ప్రజల  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్‌ వస్పరి శంకరయ్య, కమిషనర్‌ హనుమంతప్రసాద్‌, మండల తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, మండల విద్యుత్‌ అధికారి భిక్షపతి, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి వెంకటేశ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మంజుల, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


ప్రజలు ముందుకు రావాలి 

సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణం 2వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..సమస్యలను గురించి  ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేయాలన్నారు. తాగునీరు రావడం లేదని, పాత విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి వేయాలని, డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.  సర్వేనెంబర్‌ 844 స్థలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


అర్హులైన వారికి సంక్షేమ పథకాలు 

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ఆలేరు పురపాలక సంఘం చైర్మన్‌ వస్పరి శంకరయ్య అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 2వ వార్డు సాయిగూడెంలో ఆయన పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్‌ చైర్మన్‌ మొరిగాడి మాధవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo