మత్స్యాద్రిని సందర్శించిన చిత్ర దర్శకుడు రాజా

వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండగుట్టను హనుమాన్ జంక్షన్ సినిమా డైరెక్టర్ ఎం.రాజా శనివారం సందర్శించారు. మత్స్యాద్రిపై స్వామివారికి, నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయస్వామి భారీ విగ్రహం వద్ద మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయన స్వామివారి ఆశీర్వచనం అందజేసి శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ ఆంజనేయ స్వామి కృపతో 2001 సంవత్సరంలో తన దర్శకత్వంలో తీసిన మొట్ట మొదటి సినిమా హనుమాన్ జంక్షన్ 175 రోజులు ఆడిందన్నారు. తెలుగులో ఘనవిజయం సాధించి తనకు గొప్ప సినిమా జీవితాన్ని ప్రసాదించిందన్నారు.
సినిమా హక్కులు పొందిన మహాలక్ష్మీ ఫిలిం డిస్ట్ట్రిబ్యూటర్స్ సంస్థలో భాగస్వాములైన గుత్తా జితేందర్‌రెడ్డి స్వామివారి కొండపై భారీ విగ్రహం ప్రతిష్ఠించి స్వామి వారి మొక్కును చెల్లించుకున్నారన్నారు. తమిళంలో ప్రముఖ ఐదు డైరెక్టర్లలో తాను ఒక్కరినని అన్నారు. 19 సంవత్సరాల తన దర్శక జీవితంలో 9 సినిమాలు విజయం సాధించాయన్నారు. ప్రస్తుతం తన దర్శకత్వంలో పదో సినిమాను తెలుగు భాషలో తీస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా స్వామి వారి కృపతో ఘన విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బెలిద శ్రీనివాస్, మల్లిఖార్జున్, భరత్‌రెడ్డి, అశ్విన్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు