జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి ప్రత్యేక పూజలు

భువనగిరి, నమస్తే తెలంగాణ : శివారాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని వడాయిగూడెంలోని కాశీ అన్నపూర్ణేశ్వరస్వామి ఆలయంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రత్యేక పపూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో శివరాత్రి జాగారణను అనుసరించడం సంతోషకరమన్నారు. శివరాత్రి రోజున ఉపవాస దీక్ష, జాగరణ చేయంతో ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండు మనీశ్కుమార్గౌడ్, ఉపసర్పంచ్ పోశెట్టి గ్రామస్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అలాగే మండలం పరిధి బస్వాపూర్ గ్రామంలోని శంభులింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం అన్నదానం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యుడు సుబ్బూరు బీరుమల్లయ్య, సర్పంచ్ కస్తూరి మంజులాశ్రీశైలం తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి