శంభో శంకర

భువనగిరి, నమస్తే తెలంగాణ : మహాశివరాత్రి పండుగను భువనగిరి నియోజకవర్గ ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి మల్లికార్జునస్వామి, మాసుకుంట సమీపంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డిపల్లి సమీపంలోని రమణానంద మహర్షి ఆశ్రమంలో జరిగిన పూజల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, వార్డు కౌన్సిలర్లు నాయిని అరుణాపూర్ణచందర్, ఏవీ కిరణ్‌కుమార్, ఖాజా అజిమొద్దీన్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓంప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మార్మోగిన శివనామస్మరణ..
భువనగిరి అర్బన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పచ్చలకట్ట సోమేశ్వరాలయం, దోబివాడలోని దక్షణేశ్వరాలయం, పాత బస్టాండ్‌లోని సాయిబాబా దేవాలయం, కన్యకాపరమేశ్వరీ తదితర దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో సోమేశ్వరుడి కల్యాణం అర్చకుడు కప్పగంతుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, కౌన్సిలర్ కిరణ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి నక్కల చిరంజీవియాదవ్, నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, భక్తులు ఊదరి సతీశ్, ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు..
బీబీనగర్: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు సాయంత్రం విరమించి మొక్కులు చెల్లించుకున్నారు. పడమటిసోమారంలోని లింగబస్వేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహదేవపురం అక్కన్న మాదన్న ఆలయంలో ఆర్డీవో భూపాల్‌రెడ్డి కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. బీబీనగర్‌లోని శివాలయంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షను విడిచిన భక్తులకు పండ్లు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు తిప్పిరిశెట్టి సత్యనారాయణ, దుర్గయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎలుగుల నరేందర్ పాల్గొన్నారు.
వేములకొండగుట్టపై..
వలిగొండ: మండలంలోని వేములకొండగుట్టపై శ్రీ పంచముఖరామలింగేశ్వర స్వామి, రెడ్లరేపాక భవానీ శంకర్స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ కేశిరెడ్డి వేంకటేశ్వర్‌రెడ్డి, రెడ్లరేపాకలో ఇందూర్ విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్‌రెడ్డి, ధర్మకర్తలు కొమ్మారెడ్డి నరేశ్‌రెడ్డి, అంబాల లక్ష్మణ్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వలిగొండ పట్టణ కేంద్రంలోని శివాలయంలో అర్చకుడు నందిబట్ల లక్ష్మీనారాయణశాస్త్రీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. త్రిశక్తి ఆలయంలో శివుడికి ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు.
పోచంపల్లిలో..
భూదాన్‌పోచంపల్లి: మహాశివరాత్రి వేడుకలను మండలవ్యాప్తంగా భక్తులు ఘనంగా జురుపుకున్నారు. మండల పరిధిలోని పలు ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులతో పోచంపల్లి పట్టణంలో పండ్ల దుకాణాలు కిటకిటలాడాయి.
తాజావార్తలు
- తమిళనాడులో మార్చి 31వరకు లాక్డౌన్ పొడిగింపు
- వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- పార్టీ పెట్టే ఆలోచన లేదని సంకేతాలిచ్చిన ట్రంప్
- కార్లతో కిక్కిరిసిన ఎన్‌హెచ్ 44
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!