ముక్తాపూర్‌కు చేరుకున్న టీఎస్ఐసీ ఇన్నోవేషన్ యాత్ర

భూదాన్పోచపల్లి: చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ను తొలిగించే యంత్రాన్ని కనిపెట్టిన పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌కు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త గో దాసు నర్సింహను శుక్రవారం ఇన్నోవేషన్ యాత్రలో భా గంగా యువ ఇన్నోవేటర్లు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో సు మారు 26 మంది ఇటీ ఇన్నోవేటర్లతోపాటు మరో 14 మం ది వలంటీర్లు క్షేత్ర పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని నూతన ఐటీ ఇన్నోవేటర్లు కనిపెట్టిన వివిధ పరికరాల ను పరిశీలించారు. గత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి ప్రదర్శనలు కూడా జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు. అయితే వారి ద్వారా భవిష్యత్తులో తెలంగాణ అభ్యున్నతికి ఏవిధమైన తోడ్పాటును కోరవచ్చు.. అనే విధానంతో వారికి తగిన తర్ఫీదుతోపాటు వివిధ గ్రామీణ ఇన్నోవేటర్లను కలిసే అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు విభాలుగా విభజించి ఇందులో నూతన ఐటీ ఇన్నోవేటర్లను చేర్చి, ముందస్తుగా వారికి తగిన అవగాహన కల్పించారు. గతంలో వివిధ పరికరాలను కనిపెట్టిన ఇన్నోవేటర్లు.. వారు పడ్డ ఇబ్బందులు సాధించిన విజయాలను పొందుతున్న ప్రోత్సాహకాలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలో వారు గ్రామీణ శాస్త్రవేత్తల ద్వారా అనేక విషయాలను తెలుసుకోనున్నారు. ఎవరైనా గ్రామీణ ఇన్నోవేటర్లు ఆర్థికంగా సహకరించక మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులను కూడా ఈ యువ ఐటీ ఇన్నోవేటర్లు ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ సందర్భంగా గ్రామీణ శాస్త్రవేత్త గోదాసు నర్సింహ తాను తయారు చేసిన గుర్రపు డెక్కను తొలగించే యంత్రం తయారీ విధా నం గురించి విద్యార్థులకు వివరించారు. అయితే ఈ యువ ఇన్నోవేటర్లను టీ హబ్‌కు అనుసంధనం చేస్తూ.. వారు కనిపెట్టిన పరికరాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ.. వారికి ఆర్థిక సహకారం అందించి, పరికరాలను అభివృద్ధి పర్చనున్నారు. టీఎస్ఐటీ, కల్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇన్నోవేషన్ యాత్ర ప్రోగ్రామ్ ఆర్గనైజర్ విజయ, వినోద్, తులసీ కృష్ణ యువ ఐటీ ఇన్నోవేటర్ విద్యార్థులు ఉన్నారు.
తాజావార్తలు
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!