శనివారం 06 మార్చి 2021
Yadadri - Feb 22, 2020 , 02:55:47

ఆదర్శ పంచాయతీ కోసం ప్రజలు భాగస్వాములు కావాలి

ఆదర్శ పంచాయతీ కోసం ప్రజలు భాగస్వాములు కావాలి

మోత్కూరు  : ప్రజలు తమ గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా మార్చు కోవడానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని  ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో చెత్త తరలింపు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పల్లె అభివృద్ధికి సీఎం కేసీఆర్‌  ప్రాధాన్యతను కల్పించి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రజల మౌలిక వసతుల  పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దత్తప్పగూడెం గ్రామంలో ప్రతి వీధి సీసీ రోడ్డునూ మంజూరు చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇప్పటికే ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం జరిగాయని, ఇంకా మిగిలిన సమస్యలను అంచెలవారీగా పరిష్కరించేందుకు గ్రామ ప్రజలు సహకారం అందించాలన్నారు. ప్రతి రోజు ట్రాక్టరు మీ ఇళ్ల ముందుకు వచ్చినపుడు ప్రజలు చెత్తను వేసి సహకరించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడ ంవల్ల వీధులన్నీ అపరిశుభ్రంగా మారి, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదన్నారు. గ్రామ అభివృద్ధి కోసం రాజకీయలకతీతంగా సహకారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలుగు శోభ సోమయ్య, ఉప సర్పంచ్‌ మాదాను జోజప్ప, గ్రామ ప్రజాప్రతినిధులు గనగాని యాదగిరి, ఎలుగు సత్తయ్య, మామిడి వెంకటేశ్‌, గుండు యాదయ్య, గంగమల్లు, బండి వెంకటేశ్‌, కొంపెల్లి రవి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo