గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 21, 2020 , 04:04:01

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

రాజాపేట : విద్యార్థులు కష్టపడి చదివి ఇంటర్‌ పరీక్షలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, సరస్వతి కళాశాల కరస్పాండెంట్‌ పడాల శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సరస్వతీ ఇంటర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు  అనుకున్న లక్ష్యానికి చేరుకొని, తల్లిదండ్రులు, అధ్యాపకులు గర్వించే స్థాయికి ఎదుగాలన్నారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించి పలు సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సోమసాని సురేందర్‌, గుర్రం పాండు, మాధురి, పున్‌రాజ్‌సింగ్‌, నగేశ్‌ ఉన్నారు.

VIDEOS

logo